ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని నేనే తెచ్చా.. మీ చేతిలో సెల్ఫోన్ ఉందంటే అందుకు కారణం నేనే అంటాడు చంద్రబాబు. టెక్నాలజీకి ఆధ్యుడిగా ప్రచారం చేసుకునే వ్యక్తి సభలను జనం ఆన్లైన్లో చూడటం లేదు. కనీసం తెలుగుదేశం శ్రేణులు కూడా ఎల్లో మీడియాలో బాబు సభల లైవ్లను పట్టించుకోడం లేదు. దీనికి కారణాలు లేకపోలేదు. నారా వారు ప్రసంగాలన్నీ ఒకేలా ఉంటాయి. ప్రతి ఊరిలో ఒకటే పాఠం అప్పజెబుతారు. ఉరవకొండలో చెప్పిన మాటల్లో 90 శాతం పీలేరులో చెప్పారు. తర్వాత నెల్లూరులోనూ అంతే. నెల్లూరులో చెప్పిన వాటిల్లో మెజార్టీ పాఠాన్ని పత్తికొండలో వినిపించారు.
అందుకే బాబు సభలకు జనం కరువయ్యారు. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. పార్టీ నేతలు కూడా ఎప్పుడూ ఇదే సోదా.. అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా ఆన్లైన్లో బాబు ప్రసంగాలను వినిందుకు ఇష్టపడటం లేదు. మొన్న ఉరవకొండ రా కదలిరా సభ ఏబీఎన్ లైవ్ ఇవ్వగా చూసిన వారి సంఖ్య 1,500 కూడా మించలేదు.
దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ వస్తున్నాయి. సాధారణంగా బాబు సభంటే టీడీపీ పెద్ద హంగామా చేస్తుంది. తక్కువ సంఖ్యలో జనాన్ని తరలించి భారీగా వచ్చారని చూపించేందుకు డ్రోన్లను వినియోగిస్తుంది. సోషల్ మీడియా పేజీల్లో లైవ్ ఇస్తుంటుంది. ఇక ఎల్లో మీడియా కూడా చేసే హంగామా సరేసరి. అయినా ఏ ప్రయోజనం ఉండటం లేదని తెలుగు తమ్ముళ్లు విలపిస్తున్నారు. అదే జగన్ సభ విషయానికొస్తే వేల సంఖ్యలో ఆన్లైన్లో చూస్తున్నారు. మాటల్లో స్పష్టత ఉండటం, చేసిన పనుల్ని తడబాటు లేకుండా చెప్పడం తదితరాలే ఇందుకు కారణం.