ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాల పునర్విభనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాను పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసింది. నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల ద్వారా జిల్లాలో ఇప్పటి దాకా 8500 కోట్ల రూపాయల సాయం అందిందని వెల్లడించారు .
విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న విద్యాకానుక, జల వనరుల శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలు, జగనన్న చేదోడు, కాపు నేస్తం, మహిళ శిశు సంక్షేమ, వాహన మిత్ర , పంచాయతీ రాజ్, రోడ్లు – భవనాలు, అమృత్ సరోవర్, జలజీవన్ మిషన్ తదితర పథకాలు ద్వారా వేల కోట్ల రూపాయిలు లబ్ధి జరిగిందని వివరించారు.
వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం ద్వారా 15 విడతల్లో 16,28,784 మంది రైతులకు రూ.1770.75 కోట్లు లబ్ధి చేకూరగా వైఎస్ఆర్ ఫించన్ కానుక ద్వారా 2,74,839 మందికి రూ.1000 కోట్లు అందజేశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు విడతలో 1,43,808 మంది ఖాతాల్లో 915.53 కోట్లు జమ చేశారు.వైఎస్ఆర్ అసరా ద్వారా 23,351 సంఘాలకు రూ.721.63 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 1,52,130 మందికి శాస్త్ర చికిత్సా కోసం రూ.303 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గడప తొక్కి అన్ని రకాల టెస్టుల చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా హెల్త్ ప్రొఫైల్ ను మైంటైన్ చేస్తోంది ప్రభుత్వం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ఐదు విడతలో 76,159 మందికి రూ. 182.78 కోట్లు ప్రభుత్వం అందజేసింది. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు.