వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశ్వసనీయతకు మారుపేరు. మాట ఇస్తే తప్పని జననేత. 58 నెలల్లో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మేలు చేసిన నాయకుడు. మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండని కోరిన ధైర్యశాలి. చంద్రబాబు నాయుడు.. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్. హామీలు ఇచ్చి మోసం చేయడంలో దిట్ట. మాటలు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. పొత్తుల విషయంలో దేశంలోనే ఇలాంటి నేత లేడు. నిలువెల్లా విషంతో నిండిన వ్యక్తి. వెన్నుపోటు వీరుడు. ఎల్లో మీడియాతో సాయంతో ఎదిగిన నాయకుడు. ఇంకా జనంలో చాలా అభిప్రాయాలున్నాయి. వీళ్లిద్దరూ బుధవారం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
జగన్ తన పాలనపై ఎంతో నమ్మకంతో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పటికే నాలుగు సిద్ధం సభలతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పదునైన వ్యూహాలు రచించారు. మేమంతా సిద్ధం పేరుతో 21 రోజులపాటు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలుత ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను ఎండగడుతూ ప్రసంగాలు చేయనున్నారు. ఇందుకోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాత్రలో భాగంగా రోజూ ఉదయం వివిధ వర్గాలతో సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం వేళల్లో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు జరుగుతాయి.
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు బుధవారం పలమనేరు నుంచి ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తారు. మొన్నటి వరకు రా కదలి రా పేరుతో సభలు పెట్టగా తుస్సుమన్నాయి. ఈయనకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీల శ్రేణులపై ఆధారపడి ప్రజాగళం సభలు పెట్టుకున్నారు. కానీ అవి విజయవంతం అవుతాయని తెలుగు తమ్ముళ్లకే నమ్మకం లేదు. గతంలో తాను చేసిన పనులు, భవిష్యత్‌లో చేసే వాటి గురించి బాబు చెప్పే అవకాశం లేదు. జగన్‌ను తిట్టడం కోసమే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక కమలం పార్టీతో పొత్తు కారణంగా ముస్లింలు దూరంగా ఉన్న నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేలా మాట్లాడనున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఒకేసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించి రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచేశారు.