Mamata Banerjee : అహంకార పూరిత నిర్ణయాలు తీసుకుని విభజనలో ఆంధ్రాకి తీవ్ర అన్యాయం చేసి, తనకున్న జనాదరణని చూసి జగన్పై పలు కేసులు పెట్టి జైలుకెళ్ళేలా చేసి ఆంధ్రాలో పూర్తి భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ ని ఉద్దేశించి బెంగాల్ సీయం మమతాబెనర్జీ (Mamata Banerjee)జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కనీసం 40 MP సీట్లు అయినా గెలుచుకుంటుందా అంటూ ఎద్దేవా చేసారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేవలం హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణాలో మాత్రమే అధికారం లో ఉంది. తాజా సర్వేల ప్రకారం అలవికాని హామీలతో అధికారం లోకి వచ్చిన కర్ణాటకలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపొయేలా ఉంది. ఇక తెలంగాణాలో మొన్ననే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి ప్రభుత్వం నడపడానికి ఎంత ఆపసోపాలు పడుతుందో చూస్తున్నాం కూడా. కాబట్టి కష్టపడితే 6 -7 ఎంపీ సీట్లు గెలవచ్చేమో!!
ఇక నాలుగింటే నాలుగే MP స్థానాలున్న హిమాచల్ లాంటి చిన్న రాష్ట్రం లో గెలిచినా ఓడినా పెద్ద తేడా ఉండదు. ఇవన్నీ కాకుండా భస్మాసుర హస్తం వంటి బాబుతో కలిసి, షర్మిళను జగన్ మీదకి రెచ్చగొట్టి ఇప్పుడు ఆంధ్రాలో పోటీకి సిధ్ధమైంది. ఇపుడు అంతో ఇంతో సభలకి వస్తున్న జనంతో వాపుని చూసి బలుపు అనుకుంటుంది. వీటన్నిటీ గమనిస్తే మమత బెనర్జీ చెప్పిన లెక్క నిజమయ్యేలానే కనపడుతోంది.