తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు విషయంలోనే అనేక రాజకీయాలు నడిచాయి. ఇక టికెట్ల కేటాయింపు సమయంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. ఇప్పటికి కూడా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల విభేదాల సెగ తగ్గలేదు. గొడవలు పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం బాబు.. పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకుని మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఏపీ అధ్యక్షురాలు దుగ్గబాటి […]
ఫోర్బ్స్ ప్రతీ ఏటా విడుదల చేసే బిలియనీర్ జాబితాను విడుదల చేసింది. ప్రపంచం లోనే అత్యంత ధనవంతుడిగా ఫ్రాన్స్ కి చెందిన లగ్జరీ గూడ్స్ వ్యాపారవేత్త బెరెట్ ఆర్నాల్ట్ నిలవగా, స్పేస్ ఎక్స్ మరియ టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ రెండోవ స్థానం లో, అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ మూడో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక భారత్ నుండి ముఖేష్ అంబానీ(9) టాప్ 10 లో స్థానం పొందగా, భారత్ నుండి రెండో పెద్ద […]
లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ ప్రకటించింది. తాజాగా ఆయన సీఎం హోదాలో జైలు నుండి తొలి ఉత్తర్వును జారీ చేయడం విశేషం. ఢిల్లీలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ఉత్తర్వును కేజ్రీవాల్ జల వనరుల శాఖ […]
ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న సీఈసీ. దేశంలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎం లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తొలిసారి ఓటు వేయనున్న 1.85 కోట్ల యువత .85 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. […]
ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకుడికి మార్కెటింగ్ ఏజెంట్ మాత్రమే, చదివింది హైదరాబాద్ లో ఇంజనీరింగ్, మొదట చేసిన పని ఐక్యరాజ్యసమితి లో పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ గా.. తర్వాత ఇండియా కి వచ్చి 2011 లో ఎన్నికల స్ట్రాటెజిస్ట్ గా కొత్త వృత్తి చేపట్టాడు… ఐకురాజ్యసమితి లో ఉన్నప్పుడు చేసిన పని వల్ల కాంపెయిన్ ల మీద అవగాహన ఉండటంతో ఆ అనుభవాన్ని రాజకీయాల్లో కాంపెయిన్ లకు వాడుకుని అంచెలంచెలుగా ఎదిగాడు, గెలిచే […]
ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న నారిమన్ పలు చరిత్రాత్మక కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన 1929 జనవరి 10న బర్మా (ప్రస్తుతం మయన్మార్)లోని యంగూన్‌లో జన్మించారు. షిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి కోరిక మేరకు సివిల్స్ ఎగ్జామ్స్ వైపు దృష్టి సారించినా, అందుకు ఆర్థిక స్తోమత సహకరించక న్యాయవాద వృత్తి వైపు అడుగులేసారు. 1950లో21 ఏళ్లకే […]
చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష పడింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది . వివరాల్లోకి వెళితే 2019లో ప్రకాశం జిల్లా ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద బండ్ల గణేష్ 95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పును తిరిగి చెల్లించే క్రమంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావటంతో వెంకటేశ్వర్లు […]
2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బందికి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారు. వీటిని ఈ నెల చివరకు పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా శనివారం తన కార్యాలయంలో జిల్లా స్థాయి ఎన్నికల అధికారులుతో వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్లు నమోదులో, […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు జనంలోకి వచ్చే ధైర్యం లేదు. కానీ ట్విట్టర్ (ఎక్స్)లో మాత్రం పెద్ద పెద్ద పదాలు వాడతారు. తెలుగు తమ్ముళ్లేమో వాటికి సింహం గర్జించిందింది అంటూ కామెంట్లు పెడుతుంటారు. సభల్లో స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తి సోషల్ మీడియాలో మాత్రం సవాళ్లు చేస్తుంటారు. అచ్చ తెలుగులో ఆయన ఒక్క పోస్టు కూడా పెట్టలేరనుకోండి. సీ ఓటర్స్ సర్వేకు విశ్వసనీయత లేదని ఎప్పుడో తేలిపోయింది. […]
ఈనాడు రాసే ప్రతి అక్షరం వెనుక స్వార్థం ఉంటుంది. తనకు కావాల్సిన వారు ఉంటే ఒకలా రాస్తుంది. లేకప్పుడు అబద్ధాలు వల్లిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇదే దాని సిద్ధాంతం. రాష్ట్రం విడిపోయాక ధోరణి మార్చింది. మొన్నటి వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన ఎక్కడ లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తాడు కాబోలనే భయంతో బాగా కావాల్సిన వాడిని చేసుకుంది. గత ఐదేళ్లపాటు ఇక్కడ ఆత్మ బంధువు చంద్రబాబు ఉన్నారు. అందుకని ఎవరికి […]