PRC : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు 23 శాతం పీఆర్శీ (PRC) అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులు పట్ల ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, ఏపి వర్కు, ఆర్టు అండ్ పిఇటి ఇనస్టక్టర్సు యూనిటీ వెల్పైర్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షరాలు సైకం శివకుమారి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
గత కొంత కాలంగా పీఆర్సీ ని అమలు చేయాలని పలుమార్లు జేఏసీ ప్రభుత్వానికి విన్నవించుకుంది. అంతేకాక ఇటీవల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన 92 రోజుల పాటు చేపట్టిన ఉద్యమంలో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చల్లో చర్చించింది. సమస్య తీవ్రత, మూలాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి ఈ ఉత్తర్వులు ఇచ్చారని, అందుకై ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానంగా తమకు సహాయ సహకారాలు అందించి, ఆమోదించిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కృతజ్ఞతలు తేలియజేస్తున్నామని జే.ఏ.సీ సభ్యులు తెలిపారు.