అన్నదాతకు విత్తు నుంచి విక్రయం వరకు జగన్ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు తోడుగా నిలబడుతున్న జగన్ సర్కారుపై నిస్సిగ్గుగా ఈనాడు అవాస్తవ కథనాలను ప్రచురిస్తూ అబద్ధపు ప్రచారాన్ని చేస్తోంది. తాజాగా వరి వైకాపా పెద్దలకు సిరి అంటూ మరోసారి ఓర్వలేని నీచపు కథనాన్ని వండి వార్చింది.
ఈనాడు ప్రచురించిన కథనంలో ఐదేళ్ళలో వడ్లు, బియ్యం రూపంలో రూ.౩౦ వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అవాస్తవపు కథనాన్ని వండి వార్చింది. గత ప్రభుత్వంలో రూ.715 కోట్లకుపైగా రైతన్నకు బకాయిలు ఎగ్గొట్టినా నోరుమెదపని రామోజీ ప్రస్తుత ప్రభుత్వం కళ్లాలవద్దనే ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుంటే మాత్రం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. రామోజీ చెప్పినట్లుగా కాకుండా వాస్తవాలు మరోలా ఉన్నాయి.
ధాన్యం కొనుగోలు, చెల్లింపుల విషయంలో దేశంలోనే అత్యంత సమర్థవంతమైన, పారదర్శక విధానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తుంది. భారత ప్రభుత్వం/భారత ఆహార సంస్థ ఆదేశాల ప్రకారం, ప్రకటన పత్రము నందు గల నాణ్యత ప్రమాణాలను అనుసరిస్తూ నిర్ణయిoచిన మద్దతు ధరకు నేరుగా రైతుల వద్ద ఎటువంటి లోపాలు తావు ఇవ్వకుండా రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. అంతేగాక దళారీ వ్యవస్థకి అవకాశం లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యే విధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. దీనికి గానూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారిని నియమించుకుని వ్యవసాయ శాఖ ద్వారా రైతు వారి పంట విస్తీర్ణం, ఉత్పతి అంచనాలను తీసుకొని, కంప్యూటరీకరించి నేరుగా రైతుకి మద్దతు ధర అందిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో కేవలం 17.94 లక్షల మంది రైతుల నుంచి మాత్రమే ధాన్యాన్ని సేకరిస్తే, జగన్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 37.33 లక్షల రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. అంటే గత ప్రభుత్వం కంటే మిన్నగా ధాన్యాన్ని సేకరించారు. 2014 నుంచి 2019 వరకు పంట కాలానికి సంబంధించి మొత్తం ఆ ఐదేళ్లలో 2,65,10,747 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 17,94,279 మంది రైతుల వద్ద నుంచి గత ప్రభుత్వం సేకరించింది. దీనికి గానూ మొత్తం రూ.40,237 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుత ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరుకు మొత్తం 37,33,581 మంది రైతుల వద్ద నుంచి 3,37,78,882 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.64,686 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది.
గతంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అరకొరగా ఉన్న సేకరణ కేంద్రాలకే పరిమితం కాగా ఆ విధానానికి చెక్ పెడుతూ ఆర్బీకేల పర్యవేక్షణలో నేరుగా ఫాంగేట్వద్దే ధాన్యం కొనుగోలు ప్రక్రియ జగన్ ప్రభుత్వంలో జరుగుతుంది. దేశంలో తొలిసారిగా ఈ-క్రాపింగ్ చేయడాన్ని ఏపీలో జగన్ సర్కారు తీసుకొచ్చింది. ఈ విధానంలో రైతు ఎంత విస్తీర్ణంలో వేశాడన్న విషయాన్ని గ్రామ సచివాలయాల సిబ్బంది నమోదుచేస్తారు. ఈ డేటా ఆధారంగా పంట బీమా చెల్లింపు, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు, పంట నష్టపరిహారం చెల్లింపు సహా ధాన్యం కొనుగోలు జరుగుతోంది.
రైతు పంట వేసిన తర్వాత ఎంత విస్తీర్ణంలో వేశాడన్న విషయాన్ని గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది ఈ-క్రాపింగ్ చేయడం అనేది దేశంలో తొలిసారిగా ఈ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ డేటా ఆధారంగా పంట బీమా చెల్లింపు, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు, పంట నష్టపరిహారం చెల్లింపు సహా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. పంట వేసిన దగ్గర నుంచే ఈ-క్రాప్ డేటా నమోదు చేసి దానికి సంబంధించిన భౌతిక రశీదును, డిజిటల్ రశీదు సచివాలయాల సిబ్బంది ద్వారా రైతుకు అందిస్తున్నారు. దీంతో రైతులకు సంబంధించిన అన్ని వివరాలూ వ్యవసాయ శాఖలో మిళితం అవుతున్నాయి. బీమా డబ్బులైనా, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైనా, పంటల కొనుగోలు డబ్బులైనా మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు ఖాతాకే వెళ్తున్నాయి.
గతంలో రైతులు మిల్లుల వద్దకు వెళ్లి అక్కడే ధాన్యం కొలమానాల ప్రక్రియను పూర్తిచేయాల్సి వచ్చేది. జగన్ ప్రభుత్వంలో రైతులకు అలాంటి ఇబ్బంది లేకుండా రైతుల సమక్షంలోనే తూకం సహా అన్నిరకాల కొలమానాలు పూర్తిచేసి అక్కడే రశీదు ఇస్తున్నారు. ఆ రశీదులోనే అన్నిరకాల వివరాలు నమోదు చేస్తున్నారు. ఏమైనా ఫిర్యాదులుంటే FTO రశీదు వెనుక టోల్ ఫ్రీనంబర్ను కూడా ఉంచారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే రైతులు నేరుగా కాల్ చేసి ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందవచ్చు. రైస్ మిల్లు ఎంపికలో రైస్ మిల్లర్లను సంప్రదించవలసిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రం వారే బ్యాంక్ గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపికచేసి రవాణా చేయడం జరుగుతుంది.
రైతులకు గోనెసంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. ఈ విధానంలో సరిపడా గోనెసంచులు దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. APSCSCL మరియు PSA లు గోనెసంచులను రైతులకు సమకూర్చే బాధ్యతను స్వీకరించి సమర్థవంతంగా ఆ పనిచేస్తున్నాయి. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేవు. APSCSCL కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఒక వేళ రైతే గోనెసంచులుగానీ, హమాలలీలు గానీ, రవాణా ఏర్పాట్లు చేసుకుంటే ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో రైతులకు గన్నీబ్యాగులు, లేబర్, రవాణా ఖర్చులు అందేవి కావు. కానీ, ఈ ప్రభుత్వం తొలిసారిగా ఈ ఖర్చులను రైతులకు అందిస్తూ వారికి తోడుగా నిలుస్తోంది.
2022-23 పంట కాలానికి గాను, గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలు తాలుకు 15,74,285 మంది రైతులకు గాను, రూ.237.11 కోట్లను జగన్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖతాలో జమ చేసియగా ఖరీఫ్ 2023-24 పంట కాలానికి గాను, గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలు తాలుకు ఇప్పటి వరకు 6,83,825 మంది రైతులకు గాను, రూ.91.47 కోట్లను రైతుల ఖతాల్లో జమ చేయటం జరిగింది.
కొనుగోలు చేసిన ధాన్యం అక్రమ రవాణా నిరోధించడానికి వరి సేకరణ కార్యకలాపాల సమయంలో ధాన్యం వాహనంలో ఎగుమతి చేసిన దగ్గర నుంచి రైస్ మిల్లు వద్ద దిగుమతి అయ్యే వరకు, వాహనాల కదలికను జిపిఎస్ పరికరాల ద్వారా ట్రాక్ చేయడం అమలులో ఉంది. వరి సేకరణ కార్యకలాపాల సమయంలో ఎదైనా సమస్య తలెత్తినచో వాటిని పరిష్కరించటానికి, మిల్లుల వద్ద దిగుమతిలో జాప్యాన్నినివారించుట, కస్టోడియన్ ఆఫీసర్ ను నియమించారు. ధాన్యం విక్రయములో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయుటకు, ప్రతి జిల్లా కేంద్రంలో, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి రైతులకు వచ్చే సమస్యలు సత్వరమే పరిష్కరిస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విత్తునుండి విక్రయం వరకూ రైతులకు అండగా ఉంటున్న జగన్ ప్రభుత్వంపై అక్కసుతో ఓ రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా ఈనాడు కథనాలను వండి వార్చడం శోచనీయం. ఇలాంటి అవాస్తవ కథనాలను అసత్య ప్రచారాలను రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఖండించాలి.