ఆంధ్ర ప్రదేశ్ లోఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం కష్టమేనని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు అశేష జనాధారణ పొందడమే దీనికి సంకేతంగా చెప్పవచ్చని ప్రతిపక్ష పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగునా ప్రజల నీరాజనాలు పలికారు. దీంతో ప్రతిపక్ష కూటమిలో ఓటమి భయం కనిపిస్తోంది. సీఎం జగన్ను ఢీకొట్టడం కష్టమేనన్న అభద్రత భావం వారిలో కలుగుతోంది. తాజాగా ఇదే విషయాన్ని ప్రతిపక్ష కూటమికి చెందిన నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు బయటపెట్టారు
తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం కష్టమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమేననిని తెలిపారు. టీడీపీ గెలుపు అంత ఈజీ కాదని, చాలా కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం మాత్రం శూన్యమని తేల్చేశారు. ఎన్నికలకు మూడు వారాల సమయం లేని సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో లావు కృష్ణదేవరాయులు పై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.