ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా సీఎం జగన్ కొనసాగిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన నిర్వహిస్తున్న సభలన్నీ జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. కాగా పలువురు నేతలు మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్ సమక్షంలో పలువురు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీలో చేరారు.
తాజాగా సీఎం వైయస్ జగన్ సమక్షంలో గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి జనసేన రాష్ట్ర కన్వీనర్ వీరశెట్టి సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, బీజేపీ స్టేట్ కో కన్వీనర్ డాక్టర్ టీవీ రావు వైసిపి కండువా కప్పుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు.
అదేవిధంగా గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్ బైరా అజయ్‌బాబు, జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్, మైనార్టీ నేత షేక్ షాజిత్తోపాటు గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ తదితరులు వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు.
ఎన్నికల వేళ వైసీపీలో చేరికలు ఊపందుకోవడంతో వైసిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో జగన్ తో పోలిస్తే కూటమి నేతలు వెనుకబడుతున్నారు.