సీఎం జగన్ పై నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన దాడి కుట్ర కోణం ఏమిటి? ఏ ఆయుధాన్ని వాడుంటారు? ఎక్కడ నుండి ఆపరేట్ చేసి ఉంటారు? వారి వెనుక ఎవరున్నారు అనే పలు సందేహాలు వ్యక్తం అవ్వక మానవు.
రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు పైభాగం లో నిల్చుని ఉండగా అకస్మాత్తుగా బలంగా ఏదో తగలింది. రక్తం కారుతూ ఉండగా పక్కన ఉన్న సిబ్బంది సాయంతో బస్ లోకి వెళ్లి ప్రథమ చికిత్స చేయడం జరిగింది. గాయం ఎడమ కంటికి ఒకటిన్నర ఇంచు పైన ఎడమ కణతి కి రెండు ఇంచులు కుడివైపు పైభాగం లో తగిలింది…
ఎక్కడి నుండి దాడి జరిగింది?
సీఎం జగన్ బస్సు పై నుండి అభివాదం చేస్తూ దాడి జరిగిన ప్రదేశం దగ్గరికి రాగానే ఎడమవైపు నుండి బలంగా ఏదో తగిలింది అని కన్ఫర్మ్ చేయడానికి ఓ వీడియో సాక్ష్యం ఉంది.. ఆ వీడియో ని కాస్త స్పష్టంగా పరిశీలిస్తే జగన్ కు ఎడమ వైపు ఆయనకు అదే ఎత్తులో ఓ మూడు ఫ్లోర్ ల బిల్డింగ్ ఉంది (G+1). ఆ బిల్డింగ్ రెండో ఫ్లోర్ లో ఉన్న గదులలో కిటికీ లు రోడ్ వైపుగా ఉండగా, మొదటి గది కిటికీ తలుపు పూర్తిగా తెరిచి ఉండగా, దాని పక్కనే ఉన్న రెండో గది కిటికీ కొంతమేరకే తెరిచి ఉంది, కొంతమేరకు అంటే ఒక మనిషి బయట జరుగుతుంది అంతా స్పష్టంగా చూడగలిగే అంత…
సీఎం కు తగిలిన గాయం తలకు ఎడమవైపు కు, తగిలినప్పుడు సీఎం తిరిగి ఉన్న వైపు ను తీక్షణం గా పరిశీలిస్తే ఆ బలమైన వస్తువు తగిలింది ఓ 30-35 డిగ్రీల కోణం నుండి. ఆ ఎత్తు లో సీఎం కు ఎడమవైపు 30-35 డిగ్రీల కోణం లో ఉంది తెరిచి ఉన్న ఆ రెండో కిటికీ వైపే… ఇందులో ఏ రాకెట్ సైన్స్ లేనే లేదు. వీడియో స్పష్టంగా చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది… అంటే దాడి జరిగింది ఖచ్చితంగా ఆ ఎడమ వైపు ఉన్న బిల్డింగ్ లోని రెండో అంతస్తు నుండే..
దాడికి వాడిన ఆయుధమేది?
తగిలిన గాయాన్ని బట్టి అది ఖచ్చితంగా పిస్టల్, రైఫిల్ లాంటి ఆయుధమైతే కాదు. ఏమై ఉండొచ్చు అనడానికి వివిధ వాదనలు చూద్దాం…
రాయి: ఇక్కడ చేతితో రాయి విసిరారే అనుకుందాం. రాయితో కొట్టాలంటే విసిరే వ్యక్తి చుట్టు పక్కల అలాగే ఎదురుగా ఫ్రీ గా ఉండాలి… కానీ దాడి ఎక్కడ నుండి జరిగినదని భావిస్తున్నామో అక్కడ కిటికీ అడ్డం గా ఉంది. అంత ఖచ్చితంగా గురి చూసి తలకు తగిలేలా విసరడం, అందులోనూ అంత బలంగా విసరడం అసాధ్యం..
క్యాట్ బాల్: దీనికి కాస్త ఎక్కువ అవకాశం ఉంది. ఓ చిన్న రాయిని బలంగా లాగి క్యాట్ బాల్ (ఉండేలు, పిట్టలను కొట్టడానికి వాడే నాటు ఆయుధం) ద్వారా కొడితేఎయిమ్ ఖచ్చితంగా ఉంటుంది. దెబ్బ బలంగా కూడా తగిలే అవకాశమూ ఎక్కువే. కాకపోతే టప్ అనే శబ్దం విన్నాను అని పక్కనే ఉన్న విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. క్యాట్ బాల్ సౌండ్ వస్తుంది కానీ అంతమంది జనాల హోరు లో క్యాట్ బాల్ సౌండ్ దాదాపు వినపడకపోవచ్చు..
ఎయిర్ గన్: దీనికి కూడా ఎక్కువ అవకాశాలున్నాయి, కేశినేని సౌండ్ వినబడింది అని చెప్పడం ఈ వాదనకు కొంత బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. విజయవాడ లో చాలా మండి రౌడీ షీటర్ల దగ్గర ఈ ఎయిర్ గన్ లున్నాయి. పలు సందర్భాల్లో అల్లర్లు, కొట్లాటల్లో వాటిని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఓ అనుమానం ఉంటుంది. అంత మంది జనాల లో ఒక వ్యక్తి అంత ఈజీగా ఎయిర్ గన్ ను క్యారీ చేసే అవకాశాలు తక్కువే, చేతిలో తుపాకీ ఉంటే దొరికిపోయే అవకాశాలు మెండే..
బ్యాంబూ గన్: చాలా తక్కువ మంది వినుంటారు. వెదురు కర్రలతో ఒక ట్రిగ్గర్ మెకానిజం తయారు చేసి, దానిలో సీసం గోలి కానీ, లేదా గుండ్రని రాయితో గాని ట్రిగ్గర్ చేయవచ్చు. పైన చెప్పిన మిగిలిన అన్నిటికన్నా సీఎం జగన్ పై జరిగిన దాడికి ఇది ఎక్కువ అక్యురెట్.. క్యారీ చేయడం చాలా తేలిక. ఓ సీసం గోళి నో, అదే పరిమాణం లో ఉన్న రాయో చాలు. కిటికీ తెరిచి ఉన్న గ్యాప్ లో దీన్ని ఆపరేట్ చేయడం సులువు. దెబ్బ బలంగా తగులుతుంది. క్వాట్ బాల్ మెకానిజమే అయినా క్యాట్బాల్ వదిలినప్పుడు చేతులపై పడే ఒత్తిడి కారణంగా గురి తప్పే అవకాశాలు ఎక్కువ. కానీ బ్యాంబూ గన్ లో ఆ ఎర్రర్ తక్కువ. గురి చూసి తలకే అది కూడా కణతికి అతి సమీపంలో కొట్టగలిగారు అంటే చాలా ప్రొఫెషనల్ గా బ్యాంబూ గన్ ను వాడటం తెలిసిన వారిపనే ఇది…
కాబట్టి, దాడికి ఉపయోగించిన ఆయుధం బ్యాంబు గన్ అయ్యే అవకాశమే ఎక్కువ…
మరి దాడి చేయించింది ఎవరు?
ఇదేదో జగన్ పై అసంతృప్తి ఉండి జరిగిన దాడి అయితే పక్కాగా కాదు. పోనీ టీడీపీ వారు చేసే ఆరోపణ ప్రకారం సింపతి కోసం జగన్ టీం చేసిన స్క్రిప్ట్ అనుకున్నా అది ప్రాణాలతో చెలగాటమే. ఎందుకంటే ఈ మనిషీ తన తలకు ఎయిమ్ చేసుకుని రాయో, గోలినో, తూటానో తెలిసి తెలిసి తగిలించుకోలేడు. దాడి చేసిన వ్యక్తి తనవాడు అయినా అతను సరిగ్గా ఏ అపాయం లేని చోటనే తగిలేలా కొడతాడు అని నమ్మడం అసాధ్యం. ఇది టీడీపీ లో ఎవరికైనా అనుమానం గా ఉంటే నారా చంద్రబాబు నో, లేక యువకుడు అని వారనుకునే లోకేష్ నో నిలబెట్టి జగన్ కు తగిలిన అంత దెబ్బే తగిలేలా క్యాట్ బాల్ తో కొట్టించుకుని చూసారా ఇంత ఈజీ అని ప్రజలను నమ్మించి ఓట్లు అడగొచ్చు. అప్పుడు ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది. కానీ అంత ధైర్యం బాబు మరియం ఆయన తనయుడు చేసే అవకాశం లేదు.. ఎందుకంటే వారికి కూడా తెలుసు కొంచెం అటూ ఇటూ అయ్యుంటే కణతకి తగిలి ప్రాణాలు పోయేవని. ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ అయిన ఫిల్ హ్యూస్ కి ఇలాగే బాల్ తగిలి గ్రౌండ్ లో కుప్పకూలి మరణించాడు.
మరి ఎవరు చేయించి ఉండొచ్చు?
చాలా సులువుగా అందరూ వేళ్లు వెళ్లేది ఒకవైపే… దాడి ఆపరేట్ జరిగిన బిల్డింగ్ ఓ స్కూల్ వారిది. రాత్రి 8 గంటల సమయం లో స్కూల్ తెరిచి ఉండదు. సాధారణంగా స్కూల్ టైమింగ్స్ అవ్వగానే గేట్లకు తాళం వేసి వెళ్తారు, క్లాస్రూమ్ కు కూడా తాళాలు వేస్తారు. అలాంటిది ఆ సమయం లో ఓ వ్యక్తి ఆ స్కూల్ బిల్డింగ్ లోకి ఎలా దూరాడు? తాళాలు ఎవరు ఇచ్చుండొచ్చు? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో మూసి ఉన్న కిటికీలు, సెకండ్ ఫ్లోర్ లో మాత్రం ఎందుకు తెరిచి ఉన్నాయి, అందునా ఒకటి ఏమో పూర్తిగా మరొకటి పాక్షికంగా ఎందుకు తెరిచి వున్నాయి. ? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే దాడి చేసిన వాడూ, వారి వెనుక ఉన్న పెత్తందారీ మాఫియా మొత్తం బయటికి వస్తారు..
సింగ్ నగర్ బోండా ఉమా అడ్డా, రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంతా అతని అనుచరులే. వారిలో చాలా మంది ఎయిర్ గన్ లు వాడేవారూ, ప్రత్యర్ధి బైక్ పై వెళ్తున్నప్పుడు కిందపడెయ్యడానికి బ్యాంబూ గన్ లు వాడే వారూ ఉన్నారు. గతంలో సీతానగరం లో పలు సంఘటనలు జరిగిన రికార్డులు కూడా ఉన్నాయి.. ఆ సీతానగరం అల్లరిమూకల కి బాస్ బోండా ఉమా అనీ, వారి ద్వారానే కాల్ మనీ రాకెట్ నడిపేవాడని విజయవాడ ప్రజలందరికీ తెల్సిన విషయమే… ఇలాంటి దాడులను ఆపరేట్ చేయగల సత్తా విజయవాడ లో బోండాకి మెండు కాబట్టి బాబు మరియు ఆయన తనయుడు లోకేష్ లు ఈ ఆపరేషన్ భాద్యత తన నెత్తిన పెట్టుంటారు. కాకపోతే కణతకు తగలాల్సిన రాయి, తన అభిమానుల వైపు తిరగి అభివాదం చేస్తూ ఉండటం వల్ల కాస్త పైన తగిలి ప్రాణాపాయం నుండి బయట పడ్డారు…
ఇది కూడా జగన్ స్క్రిప్ట్ అని ఎవరు భావించినా వారు క్యాట్ బాల్ తోనో, ఎయిర్ గన్ తోనో డెమో ఇచ్చి నిరూపించాల్సి ఉంటుంది…