విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. సీఎం జగన్ పై రాళ్ళ దాడి ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ఐదుగురిలో ఒకరు దాడికి పాల్పడినట్లు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తుంది. నేటి సాయంత్రం దాడికి పాల్పడ్డ నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరచనున్నారనే వార్తలు వస్తున్నాయి. […]
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో తన పై దాడి జరిగిన విషయం తెలిసిందే, దాడి జరిగిన తరువాత ఒకరోజు విశ్రాంతి తీసుకొన్న జగన్ ఈరోజుతిరిగి బస్సు యాత్ర కేశనపల్లి నుండి మొదలు అయిన సందర్బంలో కేశనపల్లి స్టే పాయింట్ లో జగన్‌ను పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జగన్ కు సంఘీభావం తెలిపి పరామర్శించారు. జగన్‌ను కలవడానికి వచ్చిన నేతలు జగన్ దెబ్బ గురించి, వాపు, […]
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడిని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన ప్రాథమిక సమాచారం సేకరించి, పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాజకీయ ప్రమేయంతో పాటుగా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. కేంద్రం సైతం ముఖ్యమంత్రి పై దాడి అంశం పైన ఆరా […]
సీఎం జగన్ పై విజయవాడ నడిబొడ్డున దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. కాగా వైసీపీ శ్రేణులు ఈ దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. కానీ దాడి అనంతరం తమపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. జగన్ తనపై తానే దాడికి వ్యూహం రచించారనే ధోరణిలో టీడీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. గతంలో కోడి కత్తి కేసుకు ముడి పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేయడం ప్రారంభించింది. […]
సీఎం జగన్ పై నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన దాడి కుట్ర కోణం ఏమిటి? ఏ ఆయుధాన్ని వాడుంటారు? ఎక్కడ నుండి ఆపరేట్ చేసి ఉంటారు? వారి వెనుక ఎవరున్నారు అనే పలు సందేహాలు వ్యక్తం అవ్వక మానవు. రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు పైభాగం లో నిల్చుని ఉండగా అకస్మాత్తుగా బలంగా ఏదో […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మారడు. ఆయన ఏనాడూ ఆరోగ్యకర రాజకీయాలు చేయలేదు. తనకు గిట్టని వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ నుంచి నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరించాడు. ముఖ్యమంత్రి పదవి కోసం నాడు తన మామ ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించాడు. చివరికి ఆయన మానసికక్షోభతో చనిపోయాడంటే బాబు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. కాలక్రమంలో టీడీపీ అధినేత ఇంకా ఆరితేరాడు. […]
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ప్రత్యర్థులెవరైన సరే ఆ ఘటనను ఖండించే ప్రయత్నం చేస్తారు. కానీ టీడీపీ మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ వైపు ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడి ఘటనను ఖండిస్తూనే సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షింస్తుడగా టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఈ దాడి ఘటనపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది. గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడారని […]
సీఎం జగన్ కి ప్రజల్లో దక్కుతున్న ఆదరణను ఓర్వలేక ఆయనపై హత్య ప్రయత్నానికి పూనుకోవడం కలకలం రేపుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం జగన్ విజయవాడలో కొనసాగిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా గుర్తు తెలియని ఆగంతకుడు సింగ్ నగర్ లోని వివేకానంద రెండో అంతస్తు నుండి దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా సీఎం జగన్ యాత్ర కారణంగా కరెంటు వైర్లు తగులుతాయనే ఉద్దేశ్యంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. […]
సీఎం జగన్ పై పెత్తందారీ దూరహంకారులు దాడికి తెగబడ్డారు. పేదల సంక్షేమమే తన అజెండాగా వారిని పైకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పై పెత్తందారులు కక్ష కట్టారు. మొదటినుండి తమ అనుకూల మీడియాలో ఆయనపై విష ప్రచారం చేస్తూ వచ్చిన పెత్తందారీ వర్గం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్ పాలనను చూసి ఓర్వలేక పోతుందన్న మాటను అందరూ అంగీకరించాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే […]
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దాడి కారణంగా సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంపై గాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం యాత్రను సీఎం జగన్ కొనసాగించారు. కాగా శనివారం రాత్రి బస్సు యాత్ర ముగిసిన అనంతరం వైద్యులు సూచనల మేరకు సీఎం జగన్ […]