రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో రభీ సీజన్ కోతలు మొదలయ్యాయి. వరి పంటకు మద్దతు ధర రైతులకు చెల్లింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది అని అంచనా వేసిన ప్రభుత్వము వాటిని కొనడానికి కనీస మద్దతు ధర విషయంలో అవసరమైన చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనడానికి అవసరమయిన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వము రైతులకే డైరెక్టుగా GLP అనగా గోని సంచులు , హమాలీకూలీ, రవాణా చార్జీలు కూడా నేరుగా చెల్లించడంతో, రైతులకు ప్రైవేటు వ్యాపారులు కూడా ప్రభుత్వ ధర కంటే అధికంగా చెల్లించికొనే పరిస్థితులను కల్పించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణకు అవసరం అయిన గోనె సంచులని అందుబాటులో వుంచారు, వాహనాలను ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంచుతున్నారు. ఏదైనా అకాల వర్షాలు కురిసే అవకాశం వుంటే దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేసుకొని పొలం దగ్గరే కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసే విధంగా మరింత పకడ్బంధీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వమే అన్ని భాద్యతలను చూసుకుంటున్న తరుణంలో ప్రవేట్ వ్యాపారులు రైతులకు అధిక ధరను చెల్లించి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు . ఇప్పటికే వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొనుగోలు చేస్తున్నారు అదికారులు. దీనితో ప్రవేట్ వ్యాపారులు టన్నుకు 100-300 వరకు అధిక ధరను చెల్లించి రైతుల దగ్గర కొనుగోలు చేసుకుంటున్నారు. దీనితో రైతులకు అధిక ధర లభిస్తున్నది.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2014-19 కంటే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019-24 లోనే అధిక స్ధాయిలో ధాన్యం ను కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జగన్ ప్రభుత్వం లో ప్రభుత్వంలో ఏకంగా 37.68 లక్షల రైతుల నుండి 65,142 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇదే టైం లో చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 17.94 లక్షల మంది రైతుల నుండి 40,236 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం ను మాత్రమే కొనుగోలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కంటే జగన్ ప్రభుత్వము లో 20 లక్షల మంది రైతుల కంటే ఎక్కువగా దగ్గర ధాన్యం సేకరణ జరిగింది. జగన్ ప్రభుత్వంలో గోనె సంచులు, హమాలీ చార్జీలు, రవాణా చార్జీలు డైరెక్ట్ గా రైతులకు అందించడంతో మరింత మేలు జరుగుతుంది.
ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల నుండి ప్రతి విషయాన్ని ప్రభుత్వము గమనిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో కస్తోడియల్ అధికారులను నియమించింది జగన్ ప్రభుత్వము . అలాగే జాయింట్ కలెక్టర్ లకు అధికారాలు అప్పగించి రైతుల సమస్యల కోసం ఒక toll-free నంబర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రైతులకు ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేశారు.