ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారాలకు పేటెంట్ తీసుకున్న ఎల్లో మీడియా బాబు ప్రత్యర్థుల మీద విషప్రచారం తో చెలరేగిపోతారు.. బాబు బీజేపీ కరెక్ట్ అంటే బీజేపీ గొప్పలు ఆహా ఓహో… బీజేపీ ద్రోహం చేసింది అంటే దాని మీద ఉన్నవి లేనివి అన్నీ తవ్వి విచిత్రమైన రాతలు రాసే పసుపు మీడియా వారు వారు ఏది కరెక్ట్ అంటే జనాలంతా అదే కరెక్ట్ అని నమ్మాలి లేకుంటే ఒప్పుకోరు..
జగన్ మోహన్ రెడ్డి మీద ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుండే ఫేక్ ప్రచారాలన్నీ చేసినా, జగన్ సీఎం అయ్యాక ప్రతీ ఇష్యూ లో ఫేక్ వార్తలు వండి వార్చి జనాల మెదడులలో విషం నింపాలని చూసినా అదంతా బాబు కోసం తమ శక్తివంచన లేకుండా చేసే కృషే. ఫేక్ అనే పదానికి పేటెంటే వారిది. “అటా” అంటూ ఓ అబద్దాని, ఓ ఊహాజనిత ఫేక్ ముచ్చటను నిజం లా నమ్మించే భాద్యత తీసుకున్న ఎల్లో మీడియా కు ఇప్పుడు వారి వంటకం రుచే వారు చూడాల్సి వస్తుంది…
కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం లకు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని బీజేపి రాష్ట్ర అధ్యక్ష్యురాలు పురందేశ్వరి ప్రకటన చేసినట్లు గా ఉన్న ఓ న్యూస్ క్లిప్ వైరల్ అవుతుంది. అది ఏబీఎన్ ఛానెల్ లో వచ్చినట్లుగా కనిపిస్తుంది. కాగా ఇది ఫేక్ అని ఓ స్పెషల్ ప్రోగ్రాం పెట్టేసింది సదరు మీడియా ఛానెల్, ఇక దొరికిందే సందు అని ఫేక్ లు, దాని వల్ల అనర్ధాలు అనే కాన్సెప్ట్ మీద లెక్చర్ లు ఇచ్చేస్తున్నారు.. వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తు అధికారంలోకి రావాలని చూస్తూంది అని నీతులు భోదిస్తూంది…
అంతేలే తమరు చేస్తే నీతి అవతలి వారు అదే అస్త్రాన్ని తమపై వాడితే మాత్రం అవినీతి, అక్రమం… ఏదైనా ముందు జాగ్రత్త ఉండాలి, తాము చేసే దరిద్రమే తర్వాత తమ మెడకు అదేరీతిలో చుట్టుకుంటుంది అని..