ఇన్నేళ్ల జీవితం లో ఫస్ట్ టైం నాకు చిరాకు… అని ఆ చిరాకులోనే భాష పై జ్ఞానం కూడా వదిలేసి, జగన్ మీద ఉన్న విపరీతమైన అక్కసుతో ఆఖరికి రాక్షసుడు అని కూడా రాసేస్తున్నాడు రామోజీ…
ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా జనాల నుండి జగన్ ను వేరు చేయలేం అని అర్థం అయిన ఎల్లో మీడియాకి మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన అవసరం ఏర్పడింది.. జగన్ సీఎం అయిన వెంటనే అందుకున్న తొలి రాగం జగన్ క్రిస్టియన్, హిందూ మతాన్ని అపవిత్రం చేస్తున్నాడు, మతమార్పిడి చేస్తున్నాడు అని విషప్రచారం.. తర్వాత అవి నమ్మడం లేదని వేర్వేరు రాగాలు ఎత్తుకుని మళ్లీ మొదటికొచ్చారు.. రాష్ట్రం లో దేవాలయాలని అపవిత్రం చేస్తునట్లు గా మొన్నామధ్య జరిగిన టీటీడీ ఆద్వర్యం లో తిరుమల లో జరిగిన సదస్సులో పీఠాధిపతులు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించినట్లుగా కథలు అల్లుతూ రాష్ట్రం లో ఇప్పటి వరకు జరిగిన చిన్నా చితకా సంఘటనల్లన్నింటినీ కూడగట్టి తుచ్ఛ రాజకీయాలు అనే స్థాయిలో రాసేశాడు రామోజి…
కానీ వాస్తవానికి ఆ సదస్సులో జరిగింది వేరు… పాల్గొన్న 57 మంది పీఠాధిపతులలో ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని విమర్శించింది లేదు, కొంతమంది పీఠాధిపతులు జగన్ ప్రభుత్వం చేస్తున్న ధార్మిక సేవలను కొనియాడారు, ఒక పీఠాధిపతి అయితే ప్రత్యక్షంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ, జగన్ ప్రభుత్వం ధార్మిక సంస్థలకు చేస్తున్న మంచిని, మఠానికి ఎన్ని భూములు కేటాయించింది తదితర విషయాలను చదివి మరీ వినిపించారు..
గోవింద కోటి రాసిన భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించడం, శ్రీవారి ఆశీసులు పొందిన బంగారు మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణం, దేవాలయానికో గోవు, వంటి తదితర చర్యలపైనా ప్రశంసలు కురిపించారు…
ఇవన్నీ ఇలా ఉంటే ఈనాడు వార్త మాత్రం పూర్తిగా భిన్నంగా… తమకు నచ్చని జగన్ సీఎం గా ఉంటే వార్త మేమే శృష్టించి దాన్నే నిజంగా ప్రచారం చేస్తామని నోటి విరోచనాలు చేసుకోడం నిత్యకృత్యమైంది….
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రం లో దాదాపు 45 వేల నూతన ఆలయాలు నిర్మించబడ్డాయి…. విజయవాడ లో బాబు కూల్చేసిన 18 దేవాలయాలను జగన్ ప్రభుత్వం తిరిగి నిర్మించిన విషయం అందరికీ తెలుసు, పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో 18 దేవాలయాలు కూలిస్తే ఏనాడూ రాక్షసత్వం లా, బాబు రాక్షసుడిలా, బాబుది తుచ్చ రాజకీయం లా అనిపించలేదు రామోజీ కి…. వాటన్నింటిని పునరుద్ధరించడం, 45 వేల దేవాలయాలు కట్టడం, ఆలయాల్లో అర్చకులకు వేతనాలు పెంచడం, అర్చకుల వారసత్వపు హక్కును పునరుద్ధరించడం, మారుమూల గ్రామాల్లో పడావు పడ్డ ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకై నిధులు కేటాయించి వాటి బాగోగులు చూసుకోడం ఇవన్నీ రామోజీకి రాక్షసత్వం లా, దానవ గుణం లా కనిపిస్తున్నాయి…
ఎందుకంటే మనోడు కాదుగా, అందులోనూ ఇన్నేళ్ల జీవితం లో ఎప్పుడూ లేని చిరాకు పెట్టాడు కదా? అందుకు…. అందుకు జగన్ దానవుడు… రామోజీ నీకు నువ్వు దైవాంశసంభూతుదిలా భావించుకుని నీకు ఎదురెళ్లిన వాళ్లని రాక్షసుడు అనేసుకుంటే ఎలా?