కొందరు నాయకులు వేరే పార్టీలో ఉంటే అవినీతిపరులు.. అదే పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వస్తే మాత్రం సుద్దపూసలు.. ఇది టీడీపీ వ్యవహారం.. ఒకప్పుడు వైఎస్సార్సీపీలో ఉండి రకరకాల కారణాలతో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరగానే మంచివాళ్ళు అయిపోయారంట.. ఒకప్పుడు గుమ్మనూరు జయరాం (బెంజ్ మినిస్టర్) అవినీతి మినిస్టర్ అన్నది టీడీపీనే.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నామధ్య రెండు కోట్ల రూపాయల వాచ్ జడ్జీకి ఇవ్వబోయాడంటూ ప్రచారం చేసింది చంద్రబాబు మనుఘులే.. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం వీరప్పన్ అంటూ.. కొలుసు పార్థసారథి నాలుగు కోట్ల విలువైన భూములు కబ్జా చేశాడంటూ అన్నది టీడీపీ నాయకులే.. ఉండవల్లి శ్రీదేవికి రోజుకో పట్టుచీర గిఫ్ట్ ఇవ్వాలంట అంటూ సోషల్ మీడియాలో కోడై కూసింది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవినీతిపరుడు అంటూ తేల్చి చెప్పింది అన్నీ టీడీపీ అండ్ కో నే మరి.
ఇవన్నీ గత నాలుగేళ్ళుగా వైసీపీలో ఉన్నప్పుడు పైన చెప్పిన నాయకుల మీద చేసిన ఆరోపణలు.. ప్రస్థుతం వీరంతా టీడీపీలో చేరారు. కాబట్టి వారంతా మంచివాళ్ళంటూ ప్రచారం చేస్తున్నారు.. అయితే పరమ పవిత్రమైన పార్టీలో ఈ అవినీతిపరులని ఎలా చేర్చుకున్నారు మరి ?.. చేరాక వీళ్ళంతా మంచివాళ్ళు అయ్యారా.. ? కమండలంలో పోస్తే వీళ్లు చెప్పిన మురుగు నీరు కూడా తీర్థం అవుతుందా?టీడీపీ పార్టీ అంటేనే పార్టీ ఫిరాయించే నేతలకు పుట్టిల్లు లాంటిది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి డబ్బులకు అమ్ముడుపోయి మరో పార్టీలోకి పోయే నాయకులకు అనునిత్యం పాకేజీలతో హారతులు పట్టే నైజం చంద్రబాబుది. ఎన్నికల ముందైనా, ఎన్నికల తరువాతైనా అవినీతి చేసే చాలామంది నాయకులు అక్కడ సేదతీరుతుంటారు. అయితే పార్టీ ఫిరాయించిన నాయకులను పట్టం కడుతూ సొంతపార్టీ నాయకులను టీడీపీ అన్యాయం చేస్తుంటుంది.