నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయా ఎత్తుగడలతో రోజు రోజుకి మారిపోతూ మంచి రంజుగా మారాయి. వైసీపీ నుండి వేమిరెడ్డి , అతని భార్య ప్రశాంతి టీడీపీలో జాయిన్ అయ్యారు. ప్రశాంతి కోవూరులో టీడీపీ తరపున పోటిలో నిలబడ్డారు. మొదట నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడిని మూడు కోట్లు ఇస్తామని, టీడీపీలోకి రమ్మని అన్నదమ్ములను విడదీయడానికి మాట్లాడిన కాల్ రికార్డింగ్ హల్చల్ చేసింది. అంతే కాకుండా ప్రతి నాయకుడికి , కార్యకర్తకు రేటు కట్టి డబ్బులు విచ్చలవిడిగా […]
ఆయన్ను పొగుడుతా.. నాకేంటి.. ఆహా.. నాకేంటి అంటున్నా.. పైసలు చేతిలో పడితే కానీ నోరు తెరిచి మీకు కావాల్సిన మాటలు చెప్పను.. ఈ ధోరణిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అలియాస్ ధనసేనాని. ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాడు. అలా అని తన దత్త తండ్రి చంద్రబాబును ఫ్రీగా పొగిడేయడం లేదు. దీనికి కూడా అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలోనే లాగేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న టాక్. ‘చంద్రబాబు విజన్ – […]
– నెల్లూరు ప్రజలకు పరిచయం చేసిన లోకేశ్ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్)కి నేను పెద్ద ఫ్యాన్. ఆయనకు ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేదు. కేంద్రంలో ఆయనకున్న నెట్వర్క్ ద్వారా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారు. నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ, రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ ముగ్గురూ ట్రిపుల్ ఇంజిన్ లాంటి వాళ్లు. తప్పకుండా ప్రభంజనం సృష్టిస్తారు’ నెల్లూరులో యువతతో నిర్వహించిన ముఖాముఖిలో టీడీపీ జాతీయ ప్రధాన […]
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అలియాస్ వీపీఆర్. పైకి పెద్ద మనిషిలా కనిపించే ఈయన నీతిమంతుడు కాదని స్పష్టమైపోయింది. ఈ బడా పారిశ్రామికవేత్త అవసరాల కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడని తాజాగా లోకేశ్ మాటలతో బయటపడింది. వీపీఆర్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్యసభ సభ్యుడిని చేశారు. వైఎస్సార్సీపీలో ఎంతో గౌరవం కల్పించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. కానీ టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీ సీటు కొట్టేశారు. తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు […]
‘నా ఖాజానాలోని కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎవడు పడితే వాడు కట్టలు కట్టలు తీసుకెళ్తున్నాడు. జనంలో మాత్రం పాజిటివ్ వైబ్స్ రాలేదు. అందరూ కలిసి నన్ను ముంచేసేలా ఉన్నారు’ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) తన సన్నిహితుల వద్ద వెలిబుచ్చిన ఆవేదన ఇది. బడా పారిశ్రామికవేత్త అయిన వీపీఆర్‌కు చంద్రబాబు పెద్దపీట వేశారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఆయనకు నెల్లూరు ఎంపీ, భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్లు […]
తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్), సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ. ఆయనేమో బడా పారిశ్రామికవేత్త. దానవంతుడిగా పైకి కనిపిస్తాడు. ఈయనేమో కాలేజీలు, స్కూళ్ల అధినేత. పైకి గొప్ప విద్యావేత్తలా కనిపిస్తాడు. రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనకు వేల కోట్ల రూపాయల ఆస్తుల్లేవని, కష్టపడి పైకి వచ్చానని, విలువలున్న వ్యక్తినని చెప్పుకొంటుంటాడు. మైకు దొరికితే ముగ్గురూ గంటలు గంటలు నీతులు చెబుతారు. కానీ చేసే పనులు అందుకు పూర్తిగా విరుద్ధం. ఎన్నికల నేపథ్యంలో […]
– టీడీపీలో ఉన్న వారికే కండువాలు కప్పుతూ.. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్), ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చీప్ ట్రిక్స్ చూసి ప్రజానీకం నవ్వుకుంటున్నారు. టీడీపీని ఎవరూ పట్టించుకోవడం లేదని, హైప్ తెచ్చేందుకు పార్టీలో ఉన్న వారికే కండువాలు కప్పేస్తున్నారు. వారు చేరారు.. వీళ్లు చేరారు.. వైఎస్సార్సీపీ ఖాళీ అయిపోయిందని చీప్ ట్రిక్స్ ప్లే చేసి సంబర పడిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు చాలా ఏళ్ల నుంచి […]
‘నాకేం చెప్పొద్దు. వచ్చి కండువా కప్పించుకో చాలు. లేకపోతే నా సంగతి తెలుసుగా. రేపు పవర్లోకి వచ్చినా.. రాకపోయినా నీ అంతు చూస్తా’ నెల్లూరు రూరల్ తెలుగుదేశం అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులివి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈయన అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. రూరల్ పధిలోని వార్డులు, పంచాయతీల్లో చేరికల విషయంలో రౌడీలా ప్రవర్తిస్తున్నాడని విమర్శలున్నాయి. ప్రస్తుతం కోటంరెడ్డి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) వెంట నడుస్తున్నాడు. ఆయనకు ఆ పార్టీలో ప్రత్యేకంగా […]
అధికారం కోసం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు దిగాడు. మొన్నటి వరకు వలంటీర్లను అనరాని మాటలు అన్నాడు. ఇప్పుడేమో వారిపై కపట ప్రేమ చూపిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి రాగానే వారిని తీసేస్తామని బెదిరించి నేడు ఓట్ల కోసం రూ.10 వేలు ఇస్తామని కట్టు కథలు చెబుతున్నాడు. అయినా సేవా సైన్యం బాబు మాటలను పట్టించుకోలేదు. దీంతో కొత్త కుట్రలకు తెరతీశాడు. అధికారంలోకి వచ్చేది మనమేనని వలంటీర్లను మభ్యపెట్టండి. మాట వినకపోతే బెదిరించండి.. టీడీపీలో చేరకపోతే […]
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) తీరుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. డబ్బుతో ఇతర పార్టీల వారిని ప్రలోభపెట్టి తీసుకొస్తూ సీనియర్ టీడీపీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. ఆయన నియంతృత్వ పోకడలపై కోపంగా ఉన్నా ఏమి చేయలేని పరిస్థితుల్లో లోలోన మదనపడిపోతున్నారు. వీపీఆర్ టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌కు, ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఎంపీ పరిధిలో నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలున్నాయి. ఒక్క సిటీ మినహా […]