– నెల్లూరు ప్రజలకు పరిచయం చేసిన లోకేశ్ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్)కి నేను పెద్ద ఫ్యాన్. ఆయనకు ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేదు. కేంద్రంలో ఆయనకున్న నెట్వర్క్ ద్వారా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారు. నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ, రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ ముగ్గురూ ట్రిపుల్ ఇంజిన్ లాంటి వాళ్లు. తప్పకుండా ప్రభంజనం సృష్టిస్తారు’ నెల్లూరులో యువతతో నిర్వహించిన ముఖాముఖిలో టీడీపీ జాతీయ ప్రధాన […]
‘చంద్రబాబు నాయుడి రోడ్‌షోకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తక్కువగా వచ్చి, జనసేన వాళ్లు ఎక్కువగా వస్తే మన పరువు పోతుంది. మీ పుణ్యముంటుంది. మా కోసం వచ్చి బాబు స్పీచ్ వరకు ఉండండి. ఆ తర్వాత మీ ఇష్టం. యువతను పంపండి. డబ్బులిస్తాం’ అంటూ టీడీపీ నెల్లూరు సిటీ, రూరల్ అభ్యర్థులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కేడర్‌ను అడుక్కుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెల్లూరుకు […]
తెలుగుదేశం ఎన్డీఏలో చేరడంతో ఆ పార్టీ అభ్యర్థులు ముస్లింల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మాకు జై కొట్టండని, ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ పని అవసరమైనా చేస్తామని ఆ వర్గ పెద్దలను బతిమిలాడుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీని మెనార్టీల ద్రోహిగా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. గత ఎన్నికల సమయంలో సభల్లో ఈ విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. 24 ఎన్నికలు వచ్చేసరికి అదే మోదీ పంచన చేరారు. దీంతో ముస్లిం సమాజం టీడీపీపై కన్నెర్ర చేసింది. ఇక వారి […]
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం నేతలకి సర్వసాధారణం అయిపోయింది. అలా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన కొంతమంది నేతలు టిడిపిలో, టిడిపిలో గెలిచిన నేతలు వైఎస్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. ఇలా పార్టీ ఫిరాయించే నేతలందరికీ సాధారణంగా పార్టీలు టికెట్లు కేటాయించని పరిస్థితి. పార్టీ మారి వచ్చిన నేతలకు ప్రజాబలం, ధనబలం ఉంటే తప్ప వారికి టికెట్లు కేటాయించని పరిస్థితి. అలా పార్టీ మారిన కొంతమంది నేతలకు 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ […]
కొందరు నాయకులు వేరే పార్టీలో ఉంటే అవినీతిపరులు.. అదే పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వస్తే మాత్రం సుద్దపూసలు.. ఇది టీడీపీ వ్యవహారం.. ఒకప్పుడు వైఎస్సార్సీపీలో ఉండి రకరకాల కారణాలతో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరగానే మంచివాళ్ళు అయిపోయారంట.. ఒకప్పుడు గుమ్మనూరు జయరాం (బెంజ్ మినిస్టర్) అవినీతి మినిస్టర్ అన్నది టీడీపీనే.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నామధ్య రెండు కోట్ల రూపాయల వాచ్ జడ్జీకి ఇవ్వబోయాడంటూ […]
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్)కు తెలుగుదేశంలో పరిస్థితులు అప్పుడే అర్థమైనట్లు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో.. ఎవరిని దూరం పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వారితోనే సన్నిహితంగా ఉంటూ తెలుగు తమ్ముళ్లను దూరం పెడుతున్నారు. దీంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇటీవల వీపీఆర్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన వద్దకు సీనియర్, చోటా నేతలు క్యూ కట్టారు. శాలువాలు కప్పి సన్మానించారు. డబ్బు కోసమే అందరూ తన వద్దకు […]
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రౌడీయిజం చేయడమంటే చాలా ఇష్టం. తన మాట వినాల్సిందేనని, చెప్పింది చేయాలని అధికారులు, పోలీసులను బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక రిపోర్టర్లకు ఫోన్ చేసి చంపేస్తానని మాట్లాడిన ఆడియోలు బయటికొచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేష్టలకు అధిష్టానం ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. ఓ మహిళా ఎంపీడీఓపై దౌర్జన్యం చేసిన విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యారు. అధికార పార్టీనే అయినా […]
‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చాలా పెద్ద రౌడీ. కమలహాసన్ కూడా ఆయనలా నటించలేడు. అవినీతిపరుడు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనుడు. వ్యాపారులు, రైస్‌మిల్లుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నాడు. బెదిరిస్తూ భూ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. జనాన్ని, కాంట్రాక్టర్లను, ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నాడు. మా వాళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.’ మొన్నటి వరకు తెలుగుదేశం సీనియర్ నేతల మాటలివి. శ్రీధర్‌రెడ్డి పార్టీ మారగానే వారికి గొప్ప వ్యక్తి […]
వైస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో సదరు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది.. వచ్చేనెల 26 కు విచారణను వాయిదా వేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.. కాగా వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై ఏపీ […]
మార్చి నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు స్పీకర్ ముందుకు వచ్చింది. అధికార పార్టీ వైకాపా నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. వైకాపా ను అనుసరించి టీడీపీ కూడా తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కూడా అనర్హత వేటు వేయమని కోరింది. కాగా ఇక్కడ వైకాపా ను వీడిన ఎమ్మెల్యేలందరూ ఈ పాటికే టీడీపీ కండువ వేసుకొని […]