ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని అనకాపల్లి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆలోచనలతో ప్రచారంలో దూసుకెళ్తోంది. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ముందుపెట్టి ఓట్లు అడుగుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పొత్తులతో వస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ ‘మార్పు ఒక పదం మాత్రమే కాదు. మార్పు అంటే మాటివ్వడం. అందుకే ప్రజలు ఎన్నుకునేది జగన్నే’ అనే నినాదాన్ని తెచ్చింది. వైఎస్సార్సీపీ కొత్తగా ప్రారంభించిన క్యాంపెయినింగ్ ఇలా ఉంది. జగన్ […]
‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. స్కీమ్స్ అమలులో మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ చాలా ముందంజలో ఉంది’ ఈ మాటలు చెప్పింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి కాదు. సాక్షాత్తు ఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్, ఎయిర్ వైస్ మార్షల్ మనీష్‌కుమార్ గుప్తా. ఢిల్లీ నేషనల్ ఢిఫెన్స్ కాలేజీ నుంచి 20 మంది మనీష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని విశాఖ, అరకు తదితర ప్రాంతాల్లో రెండు రోజులు […]
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీ కేంద్ర వైద్య సేవల క్వాలిటీ అభివృద్ధి పరిశీలన బృందం అభిప్రాయపడింది. ఇక్కడి వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు అత్యవసర సేవలు అందించడంలో బాగా పనిచేస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని కితాబిచ్చింది. బృందంలో సభ్యులుగా ఉన్న డాక్టర్లు రోనఖ్శర్మ, పవేన్ థాన్ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలోని పరికిదొనలో శుక్రవారం పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్‌ను పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి పూర్తి వివరాలు […]