‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. స్కీమ్స్ అమలులో మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ చాలా ముందంజలో ఉంది’ ఈ మాటలు చెప్పింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి కాదు. సాక్షాత్తు ఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్, ఎయిర్ వైస్ మార్షల్ మనీష్‌కుమార్ గుప్తా. ఢిల్లీ నేషనల్ ఢిఫెన్స్ కాలేజీ నుంచి 20 మంది మనీష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని విశాఖ, అరకు తదితర ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పథకాలు ఎలా అమలవుతున్నాయో వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
మనీష్ స్పందిస్తూ.. మా బృందం పలు రాష్ట్రాలకు వెళ్లి సమాచారం సేకరించింది. అయితే చాలా అంశాల్లో ఏపీ మిగిలిన స్టేట్స్ కంటే చాలా ముందంజలో ఉందని కొనియాడారు. పేదల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకున్నారని అభినందించారు. ఉన్నతాధికారులు అజయ్‌జైన్, కేవీఎస్ చక్రధర్‌బాబు, జి.శేఖర్‌బాబు, డాక్టర్ వెంకటేశ్వర్, ప్రవీణ్ ప్రకాష్ తదితరులు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆ బృందానికి వివరించారు. 17 కొత్త వైద్య కాలేజీలకు ఏర్పాటు, ఇంకా పోస్టుల భర్తీ గురించి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ రంగంలో చేపట్టిన కార్యక్రమాలను తెలిపారు. విద్యాశాఖలో వచ్చిన సంస్కరణలను, ఇంధన శాఖకు సంబంధించిన పురోగతి తదితర వాటి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో ఢిల్లీ బృందం ఇక్కడ జరుగుతున్న పనులను కొనియాడింది.