ఐపీఎల్ 2025 లో భాగంగా నిన్న వాంఖడే స్టేడియంలో ముంబాయి తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ఓటమిపాలైంది . తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది , ముంబాయి బౌలింగ్ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు, ట్రావిస్ హెడ్ 48 పరుగులు , కెప్టెన్ కమ్మిన్స్ 35 పరుగులు , నీతీష్ రెడ్డి 20 పరుగులు చేసారు , మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు . ముంబాయి బౌలర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా , స్పిన్నర్ పియూష్ చావ్లా చెరో మూడు వికెట్లు తీసుకోగా బూమ్రా , అన్సుల్ చెరో వికెట్ తీసుకున్నారు
అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబాయి ఓపెనర్లు రోహిత్ శర్మ , ఇషాన్ కిషాన్ ఎప్పటిలానే నిరాశ పరిచారు , పవర్ ప్లే లోనే మూడు వికెట్లు. కోల్పోయిన తరుణంలో క్రీజు లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ ముంబాయి జట్టును విజయ తీరాలకు చేర్చారు. సూర్యకుమార్ యాదవ్ మొదట్లో కొద్దిగా తడబడినా , క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు, కేవలం 51 బంతుల్లోనే 102 పరుగులు ( 12 ఫోర్లు, 6 సిక్స్ లు ) చేసి అజేయంగా నిలిచాడు , సూర్య కూమార్ యాదవ్ కి తోడు తిలక్ వర్మ 37 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 17.2 ఓవర్లలోనే 174 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది
ఈ మ్యాచ్ ఓటమితో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి చేరాలి అంటే తరువాత అన్ని మ్యాచ్ లు తప్పక గెలవాల్సిన పరిస్థితి, అధ్బుత సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది