ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి బలంగానే కనిపిస్తున్నాయి.బౌలింగ్, బ్యాటింగ్ లలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను కనబరుస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్ లోజరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసి రికార్డు నమోదు చేసింది. దీంతో ఈ జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
ఈ మ్యాచ్ లో ఎవరిది విజయం అన్నది మాత్రం చివర వరకూ తేలడం కష్టమే ..
మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది, ఈ రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడగా రెండు సార్లు గుజరాత్ , ఒకసారి హైదరాబాద్ విజయాలు సాధించాయి
గుజరాత్ :
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్మన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయి, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్.
హైదరాబాద్ :
ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్.
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ మధ్య విశాఖ వేదికగా డాక్టర్ వైఎస్సాఆర్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరస విజయాలను నమోదు చేసుకుంటూ వస్తుంటే ఢిల్లీ కాపిటల్స్ వరస ఓటములను మూటగట్టు కుని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
విశాఖ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. చెన్నై జట్టు బలంగా కనపడుతుండగా, ఢిల్లీ జట్టు ఓటములతో ఒకింత నీరసంతో కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి బోణీ కొట్టాలని ఢిల్లీ చూస్తుంటే , ఈ రోజు గెలుపుతో చెన్నై హ్యాట్రిక్ విజయాల మీద కన్నేసింది
చెన్నై సూపర్ కింగ్స్ :
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానె, డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
ఢిల్లీ క్యాపిటల్స్ :
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.