ఐపీఎల్ 2024 లో భాగంగా లోరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై విజయం సాధించింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్ ఆశలు ఆవిరి అయ్యాయి.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు (3 ఫోర్లు, 1సిక్స్) రజత్ పటీదార్ 22 బంతుల్లో 34 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్స్‌లు ), మహిపాల్ లోమ్రోర్ 17 బంతుల్లో 32 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్స్‌లు) లతో రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు తీసుకోగా , అశ్విన్ 2 వికెట్లు, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది యశస్వి జైస్వాల్ 30 బంతుల్లో 45 పరుగులు(8 ఫోరులు ) రియాన్ పరాగ్ 26 బంతుల్లో 36 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్స్‌లు),హెట్‌మైర్14 బంతుల్లో 26 పరుగులు (3 ఫోర్లు, సిక్స్‌తో) సత్తా చాటారు. చివర్లో రోవ్‌మన్ పోవెల్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులతో నాటౌట్ గా రాజస్థాన్ కి విజయాన్ని అందించారు
ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/33) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు. రవి చంద్రన్ అశ్విన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, 16 ఏళ్లుగా ప్రతి సీజన్లో తమ టీం కప్ కొడుతుందని ఆశపడే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఈ సీజన్ కూడా నిరాశే మిగిల్చింది