ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కి అర్హత సాధించింది, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది.
హెన్రీచ్ క్లాసెన్ 34 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులతో రాణించగా.. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు, ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులతో రాణించారు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది రాజస్థాన్ టాప్ ఆర్డర్ లో యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లు విఫలం అవ్వడంతో కీలక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి చూడాల్సి వచ్చింది
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షేహ్బాజ్ అహ్మద్ (3/23) మూడు వికెట్లు , అభిషేక్ శర్మ( 2/24) రెండు వికెట్లు తీసుకున్నారు, ప్యాట్ కమిన్స్, నటరాజన్ తలో వికెట్ తీసారు. మ్యాచ్ ని కీలక వికెట్స్ తీసి మలుపు తిప్పిన షేహ్బాజ్ అహ్మద్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం జరిగే ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది, ఆరు ఏళ్ళ తరువాత ఫైనల్ లోకి చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కి ఐపీఎల్ లభిస్తుందో లేదో వేచి చూడాలి