ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆక్సర్ పటేల్ , రిషబ్ పంత్ అధ్బుత బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలలో 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆక్సర్ పటేల్ 43 బంతుల్లో 66 పరుగులు ( 5 ఫోర్లు , 4 సిక్స్ లు ) రిషబ్ పంత్ 43 బంతుల్లో 88 పరుగులు ( 5 ఫోర్లు 8 సిక్స్ లు ) చెలరేగి ఆడారు .. వీళ్ల ఇద్దరికి తోడు స్టబ్స్ 7 బంతుల్లో 26 పరుగులు చేయడంతో గుజరాత్ కి 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చారు
గుజరాత్ బౌలర్లలో వారియర్ 3 వికెట్లు , నూర్ అహ్మద్ 1 వికెట్ తీసుకున్నాడు , మోహిత్ శర్మ 4 ఓవర్లలో 73 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు
లక్ష్యచేధనకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ గట్టి పోరునే ఇచ్చారు కానీ గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగులు మాత్రమే చేయగలిగింది. వృద్ధిమాన్ స్వాహా 39 పరుగులు చేయగా , సాయి సుదర్శన్ 65 పరుగులు , డేవిడ్ మిల్లర్ 55 పరుగులు చేసారు,, చివరిలో రషీద్ ఖాన్ ఒంటరి పోరుతో మ్యాచ్ లాస్ట్ బంతి వరకు ఉత్కంఠంగా సాగింది , లాస్ట్ ఓవర్ లో గుజరాత్ గెలుపుకు 19 పరుగులు చేయాల్సి ఉండగా 15 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది , రషీద్ ఖాన్ 21 పరుగులు చేసాడు.
ఢిల్లీ బౌలర్లలో సలామ్ 3 వికెట్లు, కులదీప్ యాదవ్ 2, ముకేశ్ కుమార్ , అక్సర్ పటేల్ , నోర్జీ తలో వికెట్ తీసుకున్నారు . రిషబ్ పంత్ కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది