పులివెందులలో సీఎం జగన్నామినేషన్ దాఖలు చేసారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రత్యర్థులపై జగన్ తన దైన శైలిలో విరుచుకుపడ్డారు . గత కొంత కాలంగా రాజకీయంగా ,కుటుంబ పరంగా జగన్ ను అవినాష్ ను టార్గెట్ చేస్తూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిళ , దివంగత నేత వివేకా కూతురు సునీత చేస్తున్న విపరీత ఆరోపణలకు దీటైన కౌంటర్లు ఇచ్చారు.
వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ చిన్నాన్న
వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో జిల్లాలో అందరికీ తెలుసు, వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారు, వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే దాని అర్థమేంటి? చిన్నాన్నకు రెండో పెళ్లి అయింది వాస్తవం అవునా కాదా ? సంతానం ఉన్నది వాస్తవం అవునా కాదా ? అని ప్రశ్నలు సంధించి, చిన్నాన్న వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మా కాబట్టే అవినాష్ కి టికెట్ ఇచ్చానని జగన్ వాఖ్యానించారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీని వేధించి ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డిగారి పేరును ఎఫ్ఐఆర్ కాపీలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ? ఆ పార్టీతో అంట కాగుతూ మనమీదే నేడు ఆరోపణలు చేస్తున్నారు , వైఎస్ఆర్ నిజమైన వారసులు ఎవరో మీరే నిర్ణయించాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు . అదే సందర్భంలో నాపై ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు ఇదే నా సమాధానం అంటూ “ మీ బిడ్డ జగన్ కు ప్రజలు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసుకోవడానికి కాదు, ఆ దేవుడు మీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేద ప్రజలకు మంచి చేసేందుకు , ఆ పేద ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే నాకు ఈ పదవి ఇచ్చారని” నా బంధువులకు తెలియ చేస్తూ ఉన్నానని పరోక్షంగా షర్మిళ కు చురకలు అంటిస్తూ వాఖ్యానించారు .
పులివెందులకు జగన్ చేసిన అభివృధ్దిని కూడా వివరించి జగన్ అంటే ఒక బ్రాండ్., వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్., కడప అంటే ఒక బ్రాండ్.. పులివెందుల అంటే ఒక బ్రాండ్ ఈ పులివెందులను కుట్రలతో కుతంత్రాలతో కొట్టాలనుకుంటున్న అందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరు సిద్ధంకండి అంటూ వైఎస్ జగన్ ప్రజలను కోరారు