ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వదిన, బామ్మర్ది కలిసి చేస్తున్న రాజకీయాలే హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతన వదిన బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి చేస్తున్న కుటుంబ రాజకీయం చూపురులకు విస్తుగొలుపుతుంది. తన మరిది చంద్రబాబు నాయుడు అక్రమ అవినీతి కేసుల్లో ఇబ్బందీ పడటం చూసిన వదిన పురంధేశ్వరి తన అల్లుడు లోకేష్ ను వెంట బెట్టుకొని కేంద్ర అమిత్ షా దగ్గరకు తీసుకుపోయి కొంత ఉపశమనం కలిగించేలా చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు నాయుడి అదేశాల మేరకు కేంద్ర బిజెపి నాయకత్వంతో మాట్లాడి టీడీపీతో పొత్తుకు ఒప్పుకునేలా చేశారు పురంధేశ్వరి.
దాని తరువాత బామ్మర్ది చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ కి టికెట్ల కేటాయింపులో ఇబ్బంది కలగకుండా వ్యవహరించారు, అంతటితో ఊరుకోకుండా టీడీపీ వ్యతిరేకమైన అసలైన బిజెపి నేతలకు టిక్కెట్లు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ గా అండగా నిలిచారు. బిజెపి ఎక్కడ పోటి చెయ్యాలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే అవే సీట్లను తీసుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పిన వారికే తమ పార్టీ బిజెపి తరుపున టిక్కెట్లను కేటాయించారు అలా బామ్మర్ది ఆదేశాలను వదిన తూచ తప్పకుండా పాటిస్తూ వచ్చారు.
ఇప్పుడు తాజాగా చూస్తే కూటమిలో భాగంగా అనపర్తి టికెట్ బిజెపి కి కేటాయించారు. దాని తరువాత అనపర్తి టీడీపీ లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి, ఆఖరికి బిజెపి అభ్యర్థి ప్రచారానికి వెళ్తుంటే టీడీపీ నాయకులు కార్యకర్తలు మా టీడీపీ కండువాలు తీసి ప్రచారానికి వెళ్ళండి అని అడ్డుపడినా, బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి చూస్తూ వున్నారు తప్ప తమ పార్టీ అభ్యర్థి తరుపున ఇలాంటి సంఘటనలు టీడీపీ వారు చెయ్యడం తప్పు అని కనీసం మాట సహాయం కూడా చెయ్యలేదు. తరువాత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పురంధేశ్వరి ఏపీ బిజెపి ఎలక్షన్ ఇంచార్జీ లతో కలిసి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి బాబు సూచనలతో అనపర్తి సీటును టీడీపీకి వదిలేసి అసలు ఏ మాత్రం బలం లేని తంబలపల్లె సీటుకు ఓకే చెప్పారు.
ఇవన్నీ గమనిస్తున్న అసలైన బిజెపి నేతలు బామ్మర్ది కోసం వదిన అయిన పురంధేశ్వరి బిజెపిని తాకట్టు పెట్టేశారని చెప్పొచ్చు.