ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. కానీ వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టిడిపి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక బాగాన్ని ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99 శాతం పథకాలన్నీ అమలు పరిచాడు. ఈసారి ప్రకటించే పథకాలు హామీలు 100 శాతం అమలుపరిచే విధంగా ఉండేలా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు సమాచారం. 2019 ఎన్నికల మేనిఫెస్టోను అమలుపరచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజలలో నమ్మకాన్ని కూడబెట్టుకున్నాడు. తాను ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మకం ప్రజల్లో ఉంది.మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, యువతకు మరింత సహకారం అందించేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. ప్రజలు అవసరాలు తీర్చడమే ఈ మేనిఫెస్టో అజెండా అని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఈ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్ష పార్టీలు షాక్ కి గురి అవుతాయి అని అధికార పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు.
ఈ నెల 26వ తేదిన తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల షెడ్యూల్ లేట్ కావడంతో మేనిఫెస్టోను విడుదల చేయడంలో వైఎస్ఆర్సిపి కాస్త ఆలస్యం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జనాకర్షణ పథకాలు ఉన్నట్లు సమాచారం. మేనిఫెస్టో ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 45కు పైగా ప్రచార సభల్లో పాల్గొంటారని ఆ మేరకు షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.