2024 సార్వత్రిక ఎన్నికలకు 3 వారాల సమయం కూడా లేదు వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే 99 శాతం ఆ పథకాలన్నీ అమలు పరిచాడు. ఈసారి ప్రకటించే పథకాలు హామీలు 100 శాతం అమలుపరిచే విధంగా ఉండేలా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు సమాచారం.
మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, యువతకు మరింత సహకారం అందించేలా రూపకల్పన చేసినట్లు, ప్రజలు అవసరాలు తీర్చడమే ఈ మేనిఫెస్టో అజెండా అని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఈ మేనిఫెస్టో చూస్తే ప్రతిపకై పార్టీలు కు షాక్ కి గురి చేస్తుంది అని అధికార పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు.
ఈ నెల 26వ తేదిన తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ వై వి సుబ్బారెడ్డి మీడియాతో తెలిపారు. ఇప్పటికే పలుసార్లు మేనిఫెస్టోని విడుదల చేస్తాం అంటూ తేదీలు ప్రకటించినప్పటికీ ఎలక్షన్ షెడ్యూల్ లేట్ అవ్వడంతో మేనిఫెస్టోను విడుదల చేయడంలో వైఎస్సార్సీపీ కాస్త ఆలస్యం చేసింది. మేనిఫెస్టో పూర్తిస్థాయిలో ఇప్పటికే కూర్పు అయినప్పటికీ సీఎం జగన్ తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలతో దగ్గరగా మమేకమవడంతో మేనిఫెస్టోలో ఒకటి రెండు మార్పులు చేసి పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడానికి ఇప్పటికే ముఖ్య నాయకులతో విశాఖ జిల్లాలో సమావేశం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జనాకర్షణ పథకాలు ఉన్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. కాగా ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజున తాడేపల్లి వేదికగా మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు, మేనిఫెస్టో ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి జగన్ దాదాపు 100కు పైగా ప్రచార సభల్లో పాల్గొంటారని ఆ మేరకు షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.