‘ఢిల్లీలో ఉండే కొందరు ప్రముఖులు, అలాగే ముంబైలోని పలువురు బిజినెస్ టైకూన్స్ సర్వే చేయించారు. దీని ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 172, కాంగ్రెస్‌కు 172, ఇతరులకు 199 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 ప్లస్ రావాలని కమలం పెద్దలు కలలు కంటున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం లేదనే అర్థమవుతోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే నాయకుడిగా ఆయనకు ఏకాభిప్రాయం రాదనే తెలుస్తోంది. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించే చాన్స్ ఉంది’ యూట్యూబ్‌లో ఎల్లో భజన చేసే వైల్డ్ వోల్ఫ్ తెలుగు ఛానల్ విశ్లేషణ ఇది.
ఈ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. చంద్రబాబు అందరినీ బతిమిలాడుకుని ఎన్డీఏలో చేరితే ఎల్లో గ్యాంగ్ ఇలా ఎందుకు చెబుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవానికి బాబుకు ప్రధానమంత్రి కావాలని చాలా కాలంగా కలలున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశ ఉంది. ఒక్కోసారి అడుగులు కూడా ఆ దిశగానే వేస్తూ బోర్లా పడుతుంటారు. 2018లో ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన టీడీపీ అధినేత కాంగ్రెస్‌తో జత కట్టారు. ఆ కూటమిలో తానే సీనియర్, అనుభజ్ఞుడని, పీఎం అభ్యర్థి అయితే బాగుంటుందని ఎల్లో మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి నేతలను కలిసి వారంతా బాబు వైపే ఉన్నారని డబ్బా కొట్టారు. కానీ 19లో దారుణ ఓటమితో నారా వారి స్వరం ఒక్కసారిగా మారిపోయింది.
చంద్రబాబుకు నరేంద్రమోదీ నచ్చరు. అందుకే ఆయనపై అనేక సందర్భాల్లో నోరు పారేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తిట్టారు. ఢిల్లీలో ధర్నాల పేరుతో మోదీని వ్యక్తిగతంగా అనరాని మాటలన్నారు. తన కంటే జూనియర్ అని, తాను సీఎం అయిన చాలాకాలానికి అయ్యారని, ఉగ్రవాదని అని ఏదేదో అన్నారు. ఇప్పుడు బీజేపీ పూర్తిగా మోదీ చేతుల్లో ఉంది. ఆయన చల్లని చూపు కోసం బాబు ఎదురు చూడాల్సి వస్తోంది. అదే సమయంలో ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రి మనసులో నేనేంటి మోదీ కోసం తిరగడమేంటనే ఆలోచన కూడా ఉంది.
2019లో నరేంద్రుడు ప్రధాని కాడని ప్రచారం చేసిన చరిత్ర బాబుది. ఇప్పుడు అదే రూట్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తన మీడియా ద్వారా ఇదే చెప్పిస్తున్నారు. ఓ వైపు ఎన్డీఏలో ఉంటూనే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రావొచ్చని ప్రచారం చేస్తున్నారు. బిజినెస్ పీపుల్ సర్వేల పేరుతో మాయ చేయాలని చేస్తున్నారు. మళ్లీ తన ప్రధాని ఆశలను పచ్చ మీడియా ద్వారా బయట పెడుతున్నారు. కానీ బాబు అనుకుంది ఏదీ జరిగే సూచనలు కనిపించడం లేదు. వృథా ప్రయాస ఎందుకని అంటున్న తెలుగు తమ్ముళ్లు కూడా ఉన్నారు. తన కంటే జూనియర్ ప్రపంచం దృష్టిలో ఉంటే ఎంతైనా చంద్రబాబుకు బాధ ఉండదా.. అందుకే ఇలా చెప్పించుకుంటూ తృప్తి పడుతున్నారేమో..