2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్డీఏ కూటమిలో పొత్తులో ఉన్న టిడిపి జనసేనలో తరఫున ప్రచారం చేయనున్నారని సమాచారం. మొదట ఈ పర్యటన మే 3,4 తేదీలలో ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. కానీ మోదీ బిజీ షెడ్యూల్ కారణం చేత మే 7, 8 తేదీలకు మారుస్తున్నట్లు బిజెపి కేంద్ర అధిష్టానం […]
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది బృందం మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు బీజేపీ […]
సీఎం జగన్ కి ప్రజల్లో దక్కుతున్న ఆదరణను ఓర్వలేక ఆయనపై హత్య ప్రయత్నానికి పూనుకోవడం కలకలం రేపుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం జగన్ విజయవాడలో కొనసాగిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా గుర్తు తెలియని ఆగంతకుడు సింగ్ నగర్ లోని వివేకానంద రెండో అంతస్తు నుండి దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా సీఎం జగన్ యాత్ర కారణంగా కరెంటు వైర్లు తగులుతాయనే ఉద్దేశ్యంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. […]
ఎన్డీఏలో చేరేశాం.. విజయం మనదేనంటూ చంద్రబాబు నాయుడు విర్రవీగాడు. కానీ జరుగుతోంది వేరు. ఇక్కడ సమీప బంధువైన పురందేశ్వరి, ఇతర టీడీపీ అనుకూల బీజేపీ నాయకులు పిలవగానే స్పందిస్తున్నారు కానీ హస్తిన పెద్దల నుంచి బాబుకు ఇంత వరకు ఆశీస్సులు లభించలేదు. మార్చి 17వ తేదీన చిలకలూరుపేట సమీపంలో టీడీపీ ప్రజాగళం సభ నిర్వహించింది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పురందేశ్వరి హాజరయ్యారు. అయితే సభ నిర్వహించడంలో తెలుగుదేశం విఫలమైంది. వేల […]
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తనయుడు లోకేష్ బీజేపీ తరుపున కోయంబత్తూరులో బీజేపీ తరపున ప్రచారం చేపట్టారు, ఈ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశ ఆర్ధిక ముఖ చిత్రాన్ని మార్చేసిన దార్సనికుడు అని పొగడ్తల వర్షం కురిపించారు . ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా, లోకేష్ పొగడ్తలు చూసిన తమిళనాడు ప్రజలకి ఏమీ అనిపించక పోవచ్చు కానీ లోకేష్ నోటి వెంట విన్న తెలుగు ప్రజలకు […]
‘ఢిల్లీలో ఉండే కొందరు ప్రముఖులు, అలాగే ముంబైలోని పలువురు బిజినెస్ టైకూన్స్ సర్వే చేయించారు. దీని ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 172, కాంగ్రెస్‌కు 172, ఇతరులకు 199 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 ప్లస్ రావాలని కమలం పెద్దలు కలలు కంటున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం లేదనే అర్థమవుతోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని […]
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవంటారు. నిజమే కావొచ్చు. బాబు వంటి వారికైతే.. తమ పని కావలసినపుడు ఉఛ్ఛం, నీచం అంటూ ఏమీ ఉండవు. కావాలంటే తానే రాళ్ళయించగలడు, పువ్వులూ వేయించగలడు. చేయి తిరిగిన పని వాడు. 2019 లో తనని తాను దేశంలోని అసంతృప్త నాయకులను ఏకం చేసి, ఏకతాటిపైకి తీసుకురాగల, ప్రధాని పదవికి అర్హత ఉన్న బలమైన నాయకుడిని అని బాబు ఫీలయిన రోజులలో…. పాపం ఆయన మోడీనీ, బీజేపీని అనరాని మాటలన్నాడు. సాక్షాత్తూ ప్రధాని […]
రా కదలి రా, శంఖారావం, జయహో బీసీ, ప్రజాగళం, తాడేపల్లిగూడెం సభలకు అటు జనం.. ఇటు పార్టీల నాయకులు కార్యకర్తల నుంచి స్పందన కరువవడంతో తెలుగుదేశం సీనియర్ నేతలకు కొత్త భయం పట్టుకుంది. సభలు పెట్టొద్దని అధినేత చంద్రబాబు నాయుడిని కోరినట్లు సమాచారం. సోమవారం ఉండవల్లిలో బాబును కొందరు నేతలు కలిశారు. ఈ సమయంలో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ కావడానికి గల కారణాలపై చర్చించారు. అభ్యర్థులకు పదేపదే చెప్పినా జనసమీకరణ చేయడంలో విఫలమయ్యారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు […]
ప్రజలను ఏమార్చడంలో ఎల్లో మీడియాది అందె వేసిన చేయి. జరిగిన సంఘటన ఇంకోటైతే వేరేది చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీరియస్ అయ్యారని ఓ ఎల్లో ఛానల్లో డిబేట్ పెట్టి నవ్వులపాలయ్యారు. ఎన్నికల మీటింగ్‌కు వస్తే ఇదెప్పుడు జరిగిందా అని మూడు పార్టీల శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. ప్రజాగళం సభకు ప్రధాని మోదీ వచ్చారు. తక్కువ సమయమే ఉన్నారు. ఈ గ్యాప్‌లోనే చంద్రబాబు తన నటనా కౌసల్యాన్ని ప్రదర్శించారు. […]
ఏ ముహూర్తాన టీడీపీ వాళ్ళకి పొత్తు పొడిచిందో కానీ, సీట్ల సర్దుబాటులో పార్టీ ఇయర్స్‌లో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందుల్ని బాబు ఎదుర్కొంటున్నారు. తనకు అలవాటైన పంథాలోనే, నెగ్గలేనివి, కలిసి రానివి అనుకున్న సీట్లను పొత్తులో భాగంగా బీజేపీకి, జనసేనకి కట్టబెట్టేసి, పైకి మాత్రం ఏదో ధారాదత్తం చేసిన విధంగా డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ, లోపల దిగులు అలానే ఉండిపోతుంది. నీవు నేర్పిన విద్యయే… అన్న చందాన టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకుని, […]