బుధవారం వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని జూన్ 9వ తేదీన సీఎంగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని అందులో ఎలాంటి అనుమానం లేదని వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు మనం వెళ్లడం లేదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని, టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారంటూ కానీ ఫలితాలు మనకే అనుకూలంగా ఉంటాయి, వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడావుతుంది, బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఆయనకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించడం చూస్తున్నారు, అందుచేత కౌంటింగ్ జరిగేటప్పుడు ఏజెంట్లు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేసారు.