మొదటి నుండీ కాపులను చిన్న చూపు చూసే బాబు, వారి రాజకీయ ఎదుగుదలను సాధ్యమైనంత వరకు అడ్డుకుంటూనే ఉన్నాడు. వంగవీటి రంగా హత్య అయితేనేమి, ముద్రగడ పద్మనాభం ఉదంతం అయితేనేమి కాపులపై ఎప్పుడు వీలున్నా ద్వేషం వెళ్లగక్కే బాబు రానున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా తన ప్రతాపాన్ని చూపాడు.
కాపు నాయకులకు సీటు దక్కకుండా తన పార్టీ ద్వారానో లేక పొత్తులో భాగంగానో కాపు నాయకులను పోటీలో నిలవకుండా అడ్డుకోగలిగాడు.. రాజమండ్రి రూరల్ నుండి కందుల దుర్గేష్ మొదటి నుండీ జనసేన తరపున బలంగా ప్రచారం చేసుకున్నాడు. పొత్తులో భాగంగా ఆ సీటు తనదే అని నమ్మకం కూడా పెట్టుకున్నాడు. ముందుగా ఆ సీట్ పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు దుర్గేష్ కి కేటాయించాలని భావించినా బుచ్చయ్య చౌదరి బ్లాక్మైల్ వల్ల మళ్లీ ఆయనకే కేటాయించాడు. బయటికి ఇది బ్లాక్మెయిల్ లా కనపడ్డా మొదటి నుండి బాబు బుచ్చయ్య వైపే మొగ్గు చూపాడు. ఇక పొత్తులో భాగంగా రాజమండ్రి ఎంపీ సీటు పురందేశ్వరికి కేటాయించింది బీజేపీ, అయితే పక్కా బిజెపి వాది అయిన సోము వీర్రాజు ఆ స్థానం నుండి పోటీ చేయనాశించారు, ఆయన స్థానికుడు కూడా. అలాంటిది తన గేమ్ ప్లే లో భాగంగా పురందేశ్వరికి రాజమండ్రి సీట్ వచ్చేలా సోము వీర్రాజును సైడ్ చేసేశాడు..
ఇలాగే రాష్ట్రవ్యాప్తంగా కాపులు అధికంగా ఉన్న చోట తన సామాజిక వర్గం వారికి టికెట్ లు కేటాయించుకుని, పక్కాగా ఓడిపోయే సీట్లు మాత్రం కాపుల చేతిలో పెట్టి పొత్తులో భాగంగా కాపు ఓట్ల ద్వారా తన అభ్యర్థులను గెలిపించుకుని బలహీనమైన స్థానాలలో కాపులు పోటీ చేసి ఓడిపోతే చూసారా కాపులకు రాజకీయం చేతకాదు అని ప్రచారం చేయడానికి సంసిద్ధం గా ఉన్నాడు. బాబు ట్రాక్ రికార్డ్ తెరిచి చూస్తే ఇదేమి పెద్ద వింత విషయంలా అనిపించదు.
ఇదంతా పవన్ కళ్లెదుటే జరిగినా, అవమానాలు, ఛీత్కారాలు భరించి బీజేపీ ని పొత్తుకు ఒప్పించి కూడా తన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడు. బాబు కరివేపాకు సిద్ధాంతం లో ఇది మూడో అధ్యాయం.