2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశం నివ్వెరపోయేలా వందేళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, ఎవరి ఊహలకు ఆలోచనలకు అందకుండా 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. అయితే గతంలో ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్రగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వచ్చిన జగన్ తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏమాత్రం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తున్న పరిస్థితిని గత ఐదేళ్ల పైసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో చూస్తున్నాం.
మరి ముఖ్యంగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తను చెప్పినట్లుగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటింటికి ప్రజాపాలన పరిచయం చేశాడు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రతి గడపకు ప్రజా పాలన అందించాడు. రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా ఈ ఐదేళ్లలో తాను చేసిన మంచి ప్రతి ఇంటికి చేరితే ప్రతి కుటుంబంలోనూ తన వల్ల మేలు జరిగితే మాత్రమే తనకు ఓటు వేయండి లేదంటే వద్దని జగనే స్వయంగా చెప్తూ ఎన్నికల ప్రచారానికి అడుగులు ముందుకు వేస్తున్నాడు.
ఈరోజు తమ స్వార్ధ రాజకీయాల కోసం, పార్టీల స్వలాభాల కోసం, ఉద్దేశపూర్వకంగా తన అనుయాయుల ద్వారా కుట్రలు కుతంత్రాలు పన్ని, ప్రతి గడపకు సంక్షేమం అందించే వాలంటీర్ వ్యవస్థను తాను అధికారంలోకి వస్తే కొనసాగిస్తానని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చాడు. ఒక దశలో తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా గోనె సంచులు మోసుకునే ఉద్యోగం అంటూ మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు తలుపులు తట్టే ఉద్యోగమని అత్యంత నీచంగా చెపుకొచ్చిన చంద్రబాబు సైతం తాను అధికారంలోకి వస్తే ఇదే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పడం కొసమెరుపు.
మరోవైపు పాలనలో మంచి జరిగితేనే తనకు ఓటేయమని అడుగుతున్న జగన్.. తాను అధికారులకు వస్తే వాలంటీర్ వ్యవస్థను పునఃవ్యవస్థీకరిస్తానని ధైర్యంగా చెప్పగలుగుతున్నప్పుడు, నేను అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వం రాగానే జగన్ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను తొలగించి… గతంలో తాను పెట్టిన జన్మభూమి కమిటీలను పునరుద్ధరిస్తానని బాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ? అంటే ఈ లెక్కన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ అద్భుతమని, నేను తెచ్చిన జన్మభూమి కమిటీలు శుద్ధ దండగ అని… పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా ? తాను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని తీసుకు వస్తానని జగన్ ధైర్యంగా చెప్పగలుగుతున్నప్పుడు, తాను అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలను పునరుద్ధరిస్తానని చంద్రబాబుకు చెప్పే ధైర్యం ఎందుకు లేకపోయిందనేది రాజకీయ విమర్శకుల నుండి మాత్రమే కాకుండా టిడిపి వర్గాల నుంచి ఎదురవుతున్న ప్రశ్న.