రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ ను అబివృద్ధి చెయ్యాకపోగా అన్ని రంగాలలో పాతాళానికి తొక్కేసారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అవినీతిరహిత పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అబివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు.
GSDP గ్రోత్ రేట్ లో 2014 లో దేశంలో ఏడో స్థానంలో వున్న ఆంధ్ర ప్రదేశ్ 2018 – 2019 కి 22 రెండవ స్థానానికి వెళ్ళింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన కేవలం రెండేళ్లలో GSDP గ్రోత్ రేట్ లో దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానానికి వచ్చింది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ 130 భారీ ప్రాజెక్టులు ప్రారంభించి రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు.
చంద్ర బాబు ముఖ్యమంత్రి గా వున్న 2014 – 2019 మధ్య కాలంలో ఆ అయిదేళ్లలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 34,000 మాత్రమే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం మొదటి నాలుగేళ్లలో రెండు లక్షల పదిహేను వేల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలో వున్న ఐదేళ్లలో కేవలం 37,956 MSME యూనిట్స్ ఏర్పాటు అయ్యాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా కేవలం నాలుగేళ్లలో లక్షా పదివేల MSME యూనిట్స్ ఏర్పాటు అయ్యాయి. MSME ల ద్వారా చంద్రబాబు హయం లో నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తే నాలుగేళ్ళ జగన్ పాలనలో కేవలం MSME ల ద్వారా 10 లక్షల నలభై వేళా ఉద్యోగాలు వచ్చాయి.
ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ లో 2014 లో 12.6 % తో దేశంలో ఆరవ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో 3.2% గ్రోత్ తో దేశంలో 22 స్థానానికి పడిపోయింది. జగన్ అయిదేళ్ల పాలనలో 3.2 నుండి 12.8 % కి పెరిగి దేశంలో మూడవ స్థానానికి వచ్చింది.
అన్ని రంగాలలో అభివృద్ధి కనబరుస్తూ ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళుతున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ నాలుగున్నరేళ్ళలలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ లెక్కలు ప్రజల దాకా చేరకుండా ఉండేందుకు చంద్రబాబు మీడియా వర్గం ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయి.