చంద్రబాబు నాయుడు మోసగడాడని, ఆయన ప్రకటించిన కూటమి మేనిఫెస్టోకు విలువ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. బాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. బాబు ఉద్ధేశపూర్వకంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకుండా చేశాడు. యూనిఫాం సివిల్ కోడ్‌పై తెలుగుదేశం వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రంలో ముస్లింల ఓట్లు పడవనే భయం బాబును వెంటాడుతుంది. అందుకోసమే కూటమి మేనిఫెస్టోలో ప్రధానమంత్రి ఫొటో పెట్టలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోకు విశేష స్పందన లభిస్తోంది. నారా వారిలా మోసపూరిత హామీలు నెరవేర్చగలిగేవే అందులో పొందుపరిచారు. నెల్లూరు జిల్లాకు ప్రత్యేకంగా తాము విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలను రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం సహాయ సహకారాలతో నూరు శాతం సాధిస్తామనే విశ్వాసం ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. అయితే మేనిఫెస్టోలో మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ప్రయోజనాల కోసం మాత్రమే మేము కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాం. చంద్రబాబు యూనిఫాం సివిల్ కోడ్‌ను సమర్థిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి మేనిఫెస్టో పచ్చి అవకాశవాం. కొత్త అబద్ధాలు చెప్పడంలో సమర్థుడు చంద్రబాబు. దళితుల ఊచకోతకు కారకుడు. అతను రాజకీయాలకు అనర్హుడు.