విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టిడిపి అభ్యర్థిని మార్చనున్నారా.. అంటే దానికి సమాధానం అవుననే వినిపిస్తోంది.విజయవాడలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడికి పాల్పడిన నిందితుల్ని ఇప్పటికే సిట్ అరెస్టు చేయగా దాడి వెనుక విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం అభ్యర్ధి బొండా ఉమా మహేశ్వరరావు ప్రమేయం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో బోండా ఉమాను అరెస్టు చేసే అవకాశాలు ఉండడంతో అభ్యర్థిని మార్చే పనిలో టిడిపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో బొండా ఉమ ప్రమేయం ఉన్నట్టు తేలితే ఈసీ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో బోండా ఉమా అభ్యర్థిత్వం పై చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది . ఒకవేళ ఈ కేసులో బోండా ఉమా అరెస్ట్ జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని మార్చే అవకాశాల గురించి పరిశీలిస్తోంది.
బోండా ఉమా విజయవాడ సెంట్రల్ అభ్యర్ధిగా ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఒకవేళ బోండా ఉమా అరెస్ట్ అయితే విజయవాడ సెంట్రల్ స్థానాన్ని వంగవీటి రాధాకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. బోండాతో నామినేషన్ పత్రాల్ని ఉపసంహరింపజేసి వంగవీటి రాధాతో నామినేషన్ దాఖలు చేయించవచ్చు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధా ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి అదే స్థానం నుంచి అవకాశం వస్తుందో లేదో చూడాలి. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధ టీడీపీ పార్టీలో విజయవాడ తూర్పు నియోజకవర్గం సీటు వస్తుందని ఆశించి ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో టిడిపి వారు సీట్ కేటాయించుకున్న వంగవీటి రాధాను స్టార్ క్యాంపెనర్ గా చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా వంగవీటి రాధాకి టికెట్ టిడిపి కేటాయించలేదు, ఇప్పటికే వంగవీటి రాధ కాపులు అధికంగా ఉన్నచోట సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు.