ఏపిలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్ అట్టహాసంగా వేశారు వారితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల కీలక నాయకులు స్వతంత్రులుగా పోటీలో నిలిచి తమ అభిమానులు వెంటరాగా కోలాహలంగా తమ నామినేషన్ లను దాఖలు చేశారు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి ఉండి నియోజకవర్గం. ఇక్కడ కూటమి తరుపున టీడీపీ నుండి ఏపీ లోనే అత్యంత వివాదాస్పదుడైన రఘు రామ కృష్ణంరాజు పోటీలో వున్నారు. అయితే ఇదే ఉండి నుండి టీడీపీ రెబల్ అభ్యర్థిగా నియోజకవర్గంలో స్థానికంగా అత్యంత బలమైన నాయకుడు శివరామరాజు పోటీలోకి దిగుతుండడం ఆసక్తిని కలిగించే అంశంగా చెప్పవచ్చు.
2009,2014 లో టీడీపీ నుండి ఉండి నియోజకవర్గంలో శివరామరాజు మంచి మెజారిటీతో గెలుపొందారు అయితే 2019 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ఎంపీ గా పోటి చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి తిరిగి ఉండిలో ఎంఎల్ఏ గా పోటి చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. తీరా ఎన్నికల నేపథ్యంలో రఘురామరాజుకు చంద్రబాబుకు వున్న ప్రత్యేక బంధం దృష్ట్యా రఘురామరాజుకు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం కల్పించాల్సి రావడం అందులో టీడీపీకి కంచుకోట లాంటి ఉండి నియోజకవర్గం నుండి చివరకు పోటి చేసే విధంగా ఒప్పందం కుదరడం జరిగిపోయినాయి. అయితే దీనికి ఒప్పుకోని శివరామరాజు పోటీలో వుంటాను అని ప్రకటించి ఊరు ఊరుకి తిరగడం మొదలుపెట్టి ఈరోజు ఉండి నియోజకవర్గ ప్రజలు టీడీపీకి చెందిన కీలక నాయకులు కార్యకర్తలు తోడు రాగా అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇది చూసిన తరువాత రఘురామరాజుకు, టీడీపీ నాయకులకు ఓటమీ భయం అందుకుంది.
ఇంకా నామినేషన్ లకు ఉపసంహరణకు టైం వుండడంతో ఇప్పుడు శివరామరాజును బుజ్జగించే పనిలో పడ్డారు టీడీపీ నేతలు . అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడిన కూడా శివరామరాజు వెనక్కి తగ్గే పరిస్థుతులు కనపడటం లేదు. చూస్తుంటే రఘురామరాజుకు ఇంటిపోరు తప్పేలా కనపడటం లేదు.