ఆంధ్రప్రదేశ్ లో సంభవించే తుఫానులు వరదల వల్ల తీవ్రంగా నష్టపోతూనే ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు రైతులు తుఫానుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా తాజాగా సంభవించిన మిచాంగ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు కుదేలైపోయారు. మిచాంగ్ తుఫాన్ సమయంలో జగన్ సర్కారు స్పందించిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు.
తుపాను సమయంలో 492 శిబిరాలు ఏర్పాటు చేసి 33,010 మందిని శిబిరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించింది. తక్షణ సహాయం కోసం రూ.52.47 కోట్లు విడుదల చేయడమే కాకుండా 374 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి,1,32,613 మందికి ఆహార ప్యాకెట్లు అందించారు. ప్రత్యేక ఆర్థిక సహాయం కింద రూ.28.07 కోట్ల పంపిణీ చేసింది జగన్ ప్రభుత్వం.
కానీ ఎల్లో మీడియాలో మాత్రం ప్రభుత్వ సాయాన్ని తక్కువ చేస్తూ కథనాలు ప్రచురిస్తూ వచ్చాయి. రాష్ట్రంలో తుఫాన్ వరదలు సంభవించినప్పుడు గత ప్రభుత్వ సాయానికి జగన్ ప్రభుత్వం స్పందించిన తీరు చేసిన సాయానికి ఉన్న తేడాను రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగి రెడ్డి మీడియాకి వివరించారు. ఆయనేం అన్నారంటే..
‘హుద్‌హుద్ తుపానులో చంద్రబాబు తెల్లవారుజాములూ డ్యాష్‌బోర్డు వద్దే కూర్చుని తుపానును మళ్లించి నష్టం లేకుండా చేశారని పచ్చ పత్రికల్లో వార్తలు రాశారు. హుద్‌హుద్ తుపాను సమయంలో చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన నివేదికలో మహారాష్ట్రలో చనిపోయిన మృతదేహాన్ని చూపిస్తూ రూ.3వేల కోట్ల నష్టం అని కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో కేంద్రం ఆ విషయాన్ని గుర్తించి రూ.600 కోట్లు ఇచ్చి సరిపెట్టారు. అలాంటి మోసాలు చేయడం ఈ ప్రభుత్వానికి, జగన్ కి చేతకాదు.
తిత్లి తుపానులో నష్టం జరిగింది ఉద్యానపంటలకైతే, చంద్రబాబు మాత్రం ధాన్యానికి ధర పెంచాను అని ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ తిత్లి తుపానులో నష్టపోయిన రూ.182.63 కోట్లు జగన్ వచ్చిన తర్వాత చెల్లించారు. 2018–19లో ఖరీఫ్, రబీలో కరవు మండలాలను ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు. అలాగే 2019 రబీలో రైతుల బీమాలో కేంద్ర ప్రభుత్వ వాటా చెల్లించినా చంద్రబాబు వల్లే రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించలేదు.
రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విధి విధానాల ప్రకారం 103 మండలాలను కరవు మండలాలుగా గుర్తించింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలపడంతో కేంద్రబృందం వచ్చి రాయలసీమలో పర్యటించి వెళ్లింది. మిచాంగ్ తుపానుకు సంబంధించి ప్రాథమికంగా రూ.3,711 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి నివేదించడం జరిగింది. పంట నష్టం అంచనాలు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయి.
19వ తేదీలోపు నష్టానికి సంబంధించిన పూర్తి జాబితా కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన వర్షాలు ప్రారంభం అయ్యాయి. అప్పటికి సివిల్ సప్లయిస్ ద్వారా 5.09 లక్షల టన్నుల కొనుగోలు ఉంది. 4,5,6 తేదీల్లో వర్షాలు కురిసినా రోజు 50 టన్నుల ధాన్యం ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేశాం. ఈ రోజుకు ధాన్యం సేకరణ 13.29లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.
అంటే తుపాను సమయంలో సుమారు 5.20 లక్షల టన్నుల సేకరణ జరిగిందని నాగిరెడ్డి వెల్లడించారు.
సాయం ఎవరి పాలనలో ఎంత
పై జాబితా పరిశీలిస్తే ఏ విధంగా చూసినా గత ప్రభుత్వంకంటే మెరుగైన సాయాన్ని అందించడంలో జగన్ ప్రభుత్వం ముందుందనే విషయం సులభంగా అర్ధమవుతుంది. కానీ ఎల్లో మీడియా మాత్రం నిజాలను మరుగుపరుస్తూ అసత్య కథనాలు ప్రచురించడం గమనిస్తే ఓ రాజకీయ పార్టీకి లబ్ది కలిగించేందుకు జర్నలిజం విలువలను కూడా తుంగలో తొక్కుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.