సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారన్న ఆరోపణలపై సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్నికల సమయంలో లంచం ఇవ్వడానికి సంబంధించిన ఐపిసి సెక్షన్ 171-ఇ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 (1) కింద కేసు నమోదు సినట్లు పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 12న చెర్లోపల్లి గ్రామంలోని గిరిజన మహిళలకు సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్‌రెడ్డి నగదు పంపిణీ చేస్తున్నట్లు సోషల్‌మీడియాలో వీడియోలు హల్చల్ చేశాయి. ఈ విషయం వెల్లడి కావడంతో వైఎస్ఆర్సీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన చర్యను సమర్థించుకున్నారు, గిరిజన మహిళలకు సహాయం చేయడానికి మానవతా దృక్పధంతో డబ్బు పంపిణీ చేసినట్లు తెలిపారు. తొలుత ఈ ఫిర్యాదును రిటర్నింగ్ అధికారి పక్కన పెట్టిన, సోమిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం హరి నారాయణన్ కేసు నమోదుకు ఆదేశించడంతో సోమిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసారు