వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుండి ఏదో ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం పైన జగన్ పైన వండి వార్చడం ఈనాడుకు పరిపాటిగా మారింది. ఇప్పుడు అదే క్రమంలో మంగళగిరి ఐటీ పై జగన్ వేటు అంటూ ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమానికి తెరతీసింది ఈనాడు. మంగళగిరిలోని ఆటోనగర్లో ఐటీ టెక్ పార్కు భవనం అందుబాటులోకి రావడంతో అక్కడ 8 కంపెనీలు వచ్చి వెళ్లిపోయాయి అంటూ ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. కానీ ఆ వెళ్లిపోయిన కంపెనీల పేర్లు ఏంటో చెప్పమంటే మాత్రం ఒక కంపెనీ పేరు కూడా రాయలేదు ఈనాడు.. అసలు ఒక్క కంపెనీ అయినా వస్తే కదా వెళ్లిపోవడానికి!
నిజానికి కొంతమందికి లబ్ది చేకూర్చాలని స్వార్థంతో, కేవలం తన అనుయాయూలకు మాత్రమే దోచి పెట్టాలనే ఆలోచనతో, కేవలం కులాభిమానంతో అమరావతి పల్లెలు రాజధానిగా చేయకుండా అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు ఉండి అతి తక్కువ ఖర్చుతో తక్కువ టైంలోనే హైదరాబాదుకు దీటుగా ఎదగాలిగే అవకాశం ఉన్న విశాఖపట్నం నగరాన్ని రాజధానిగా చేసి ఉంటే హైదరాబాదులో ఉన్న కంపెనీలలో సగం కంపెనీలు ఆంధ్రా కు వచ్చి ఉండేవి. అయితే వైయస్ జగన్ సీఎం అయ్యాక బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా, రాండ్స్టాండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించాయి.
రాష్ట్రానికి 65కు పైగా కొత్త కంపెనీలు రాగా విశాఖలో డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ గ్రూపులు భారీగా విస్తరించాయి. టెక్ మహీంద్రా విశాఖ నుంచి తన కార్యకలాపాలను విజయవాడకు కూడా విస్తరించింది. మరి బాబు హయాంలో చెప్పుకోదగ్గ పేరెన్నికగన్న ఒక్క పెద్ద ఐటి కంపెనీ అయినా వచ్చిందా? జగన్ పాలనలో ఇన్ఫోసిస్, రాండ్స్టాండ్, బీఈఎల్ వంటి దిగ్గజ సంస్థలు వచ్చాయి. బాబు దిగిపోయిన 2019 నాటికీ ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643 మాత్రమే ఉంటే.. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య అక్షరాలా 75,551… చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్న ఐటీ ఉద్యోగుల్లో సగం మందికి పైగా YS రాజశేఖర్ రెడ్డి ముందుచూపుతో విశాఖ, కాకినాడ, విజయవాడల్లో అభివృద్ధి చేసిన ఐటీ పార్కుల్లో పనిచేస్తున్నవారే కావడం విశేషం.