‘తెలుగుదేశంలో చేరిన సినిమా హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్’ అంటూ సోషల్ మీడియా అధికారిక పేజీలో పోస్టు చేశారు. వాస్తవానికి నిఖిల్‌కు మొదటి నుంచి టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇది నిజం. కానీ ఆయన పార్టీలో మాత్రం చేరలేదు. కాకపోతే ఇటీవల కార్తికేయ – 2 సినిమా ద్వారా ఫేమ్ వచ్చింది. దీంతో ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు ఎల్లో గ్యాంగ్ చీప్ ట్రిక్స్‌కు దిగింది.
నిఖిల్ 2019 ఎన్నికల సమయంలో కేఈ ప్రతాప్ తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలో చాలా విమర్శలు మూటగట్టుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నువ్వు టీడీపీకి ప్రచారం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తే ఫ్యామిలీ వేరు. రాజకీయం వేరని సమాధానం వచ్చింది. కాగా చీరాల తెలుగుదేశం అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ అల్లుడే ఈ నిఖిల్. కొండయ్య కుమారులైన గౌరీ అమర్నాథ్, మహేంద్రనాథ్‌తో కలిసి లోకేశ్‌ను కలిశారు. దీనికే తెలుగు తమ్ముళ్లు ఇస్తున్న బిల్డప్ మామూలుగా లేదు. వాస్తవానికి సదరు హీరో కులం గురించి చాలా మందికి తెలియదు. అది పనిగా సోషల్ మీడియా ఖాతాల్లో నిఖిల్ సిద్ధార్థ యాదవ్ అని వేశారు. బీసీలు టీడీపీకి దూరమవడంతో వారి ఓట్ల కోసం ఇలా స్కెచ్ వేశారు.
కాగా నిఖిల్ పీఆర్ టీం స్పందించింది. చీరాల అభ్యర్థి కొండయ్య యాదవ్‌కు హీరో అల్లుడని, ఆయనకు మద్దతుగా ప్రచారం మాత్రమే చేస్తారని చెప్పింది. నిఖిల్ టీడీపీలో చేరలేదని స్పష్టం చేసింది. క్యాజువల్‌గా కండువా వేశారని, ఆయన కాదనలేకపోయారని వెల్లడించడంతో పచ్చ గ్యాంగ్ పరువు గంగలో కలిసింది. లోకేశూ.. అలా ఎవరికి పడితే వారికి కండువాలు వేయకూడదు. పవన్ కళ్యాణ్‌లా అందరూ తలాడించరంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.