పులివెందులలో నే ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి, వైసీపీ కి అభ్యర్ధులే దొరకడం లేదంటూ చంద్రబాబు కితకితలు…
పులివెందులలో కూడా గెలిచేస్తాం అని 2019 ఎన్నికల సమయం లో బీరాలు పలికి చివరికి 100 ఓట్ల మెజారిటీ కూడా తగ్గించలేకపోయారు, పులివెందులలో భారీ మెజారిటీ తో గెలిచి జగన్ సీఎం అయ్యాడు… చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే గా మిగిలిపోయాడు..
ఇక కుప్పం విషయానికి వస్తే ..
1999 ఎన్నికల్లో 65,687 మెజారిటీ గెలిస్తే…..
2004 ఎన్నికల్లో 59,588 మెజారిటీ వచ్చింది..
2009 ఎన్నికల్లో 46,066 మెజారిటీ వచ్చింది..
2014 ఎన్నికల లో పెద్ద ఎత్తున ఓటర్లు పెరిగినా 47,121 మెజారిటీ మాత్రమే వచ్చింది…
ఇక 2019 ఎన్నికలకి వస్తే దెబ్బకి ఆ మెజారిటీ 30,722 అయింది…
అంటే 2004 నుండి బాబు మెజారిటీ వరుసగా తగ్గుతూనే వచ్చింది… ఇక తమిళనాడు నుండి తీసుకొచ్చే దొంగ ఓటర్లను లిస్ట్ నుండి తీసేస్తే బాబు ఎప్పుడో చంద్రగిరి నుండి కుప్పానికి మారినట్లు కుప్పం నుండి ఇంకో చోటు వెతుక్కునే వాడు…
ప్రస్తుత పరిస్థితి చూస్తే బాబుకు స్థానచలనం తప్పేలా లేదు పాపం..
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది…
35 ఏళ్లు ఎమ్మెల్యే గా, సీఎం గా ఉండి కూడా కుప్పంని మున్సిపాలిటీ గా చేయలేకపోయాడు బాబు, వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కుప్పం ను మున్సిపాలిటీ గా చేసి, కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది..
దానికి తోడు ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీ పొంది ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది..
కుప్పం నియోజకవర్గం లోని మెజారిటీ పంచాయితీలు గెలిచింది…
2019 తర్వాత జరిగిన ప్రతీ స్థానిక ఎన్నికల్లో కుప్పం లో పెద్ద పెద్ద షాక్ లే తగిలాయి.. ఒక పక్క జగన్ దెబ్బకు రాష్ట్ర స్థాయిలో విలవిల్లాడుతున్న బాబుని, పెద్దిరెడ్డి రూపంలో జిల్లా లో మరొక దెబ్బ వెంటాడుతూ ఉంది.. ఇక కుప్పం కష్టమే అని నిర్ధారణకు వచ్చాక, నియోజకవర్గం మారితే ఉన్న కాస్త పరువూ గంగపాలు అవుద్ది అనుకుని, స్థానిక నాయకుల కాళ్లా వేళ్లా పడటం చూస్తూనే ఉన్నాం.. 1983 నుండి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏనాడు సొంత ఇల్లు కట్టుకోవాలని అనిపించనేలేదు… ఓటమి కళ్లముందు కనపడేసరికి కుప్పంలో ఇప్పుడు, ఇన్నేళ్ల తర్వాత ఇల్లు కట్టుకుంటా అని శంకుస్థాపన చేశాడు… (అదెప్పటికీ పూర్తవదులెండి అది వేరే విషయం)
బాబుకి బాగానే తెలుసు… కుప్పం సీటు కింద నీళ్లొచ్చాయని…!
అందుకే ఈ మేకపోతు గాంభీర్యాలు… పరిస్థితి ఇలాగే ఉంటే బామ్మర్దిని బలిచేసి హిందూపూర్ నుండి పోటీ చేయడం కూడా జరిగేలా ఉంది.. ఇప్పటికే హిందూపూర్ నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద కూడా చర్చ జరుగుతుందని టీడీపీ వర్గాల నుండే ఉన్న సమాచారం…
కుప్పం రాగలరా ఏంటి బాబూ? ఆల్రెడీ వచ్చేసారు.. అదే నీ భయం కూడా…