నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేవలం టీడీపీ పార్టీకి చెందిన ఎవరో ఆకతాయి చేసిన చిల్లర దాడిగా పరిగణించటానికి వీళ్ళేనిది. ఇది ఖచ్చితంగా భౌతికంగా అంతమొందించే కుట్రే. శరీరంలో సున్నితమైన భాగాల్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసి అంతమొందించే నేరస్తులకు బెజవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొదవ లేదు .
అలాంటి నేరస్తులు లక్ష్యం చేసుకొన్న వ్యక్తుల దినచర్య, కదలికలు గమనించి, నేరుగా దాడి చేయకుండా, సీసీ కెమెరాలకు దొరక్కుండా దూర ప్రాంతం నుండి ఆ వ్యక్తి కణత, గొంతు, లాంటి ప్రాంతాల పై సాధారణంగా కనిపించే కాట్ బాల్, ఎయిర్ గన్, బాంబూ( వెదురు) గన్ లాంటి ప్రమాదకర ఆయుధాలతో దాడి చేస్తారు. ఈ దాడిలో లక్ష్యం తీవ్రంగా గాయపడటం, లేదా ప్రాణాలు కోల్పోవటానికే అవకాశాలు ఎక్కువ.
విజయవాడ కేంద్రంగా గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి, దూరంగా ఉండి దాడి చేయటం, చీకటి మాటున రాళ్ళతో కొట్టటం, బ్లేడ్ల వంటి పదునైన ఆయుధాలతో శరీరాన్ని చీల్చడం వంటి నేరాలు విజయవాడలో కొల్లలు. ఇలాంటి నేరస్థులకు ఆశ్రయం ఇచ్చి పని కల్పించే వారు ఎవరో కూడా అందరికీ తెలిసిన విషయమే.
బెజవాడలో కొండ కింద వర్గంగా పేరున్న ఒక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు తమ ఆర్ధిక నేరాలకి, దంధాలకి, కాల్ మనీ లాంటి వ్యాపారాలలో అడ్డు వచ్చిన వారిని తప్పించడానికి దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, బెదిరింపులకు ఇలాంటి నేరస్థులని పెంచి పోషిస్తారు అనేది జగమెరిగిన సత్యం . గతంలో అసెంబ్లీ సాక్షిగా పాతేస్తా నాకొడకా అన్న ఎమ్మెల్యేనే ఇలాంటి బ్యాచ్ ని ఎక్కువగా పెంచి పోషిస్తుంటాడని తన అనుచరుల చేతే ఆ వర్గానికి అవసరమైన నేరాలు చేయిస్తుoటాడని అతని కనుసన్నల్లోనే ఈ దారుణానికి ఒడిగట్టారని విజయవాడ ప్రజల అభిప్రాయం.