టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్న టీడీపీ, ఆఖరికి తమ అరాచకాలకు మూగ జీవులైన విదేశీ పక్షులను కూడా వదల్లేదు. ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రంలో స్థానిక టీడీపీ నాయకుల వల్ల పక్షులకు రక్షణ లేకుండా పోయింది. అప్పట్లో చేపల కోసం చెరువులను ఎండబెట్టడంతో విదేశాల నుండి ఉప్పలపాడుకు తరలి వచ్చే ఎన్నో రకాల పక్షులు మృత్యువాత పడ్డాయి. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారాన్నే రేపింది.
పక్షుల మృతికి ఎండ వేడి కారణమని నాటి జిల్లా టీడీపీ అధ్యక్షుడు యడ్లపాటి వెంకట్రావు చెప్పుకొచ్చారు. కాగా పక్షులు నీరు లేక పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయని తెలియడంతో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ న్యూస్ ని కవర్ చేయడానికి వచ్చారు. కాగా అలా న్యూస్ కవర్ చేసేందుకు వచ్చిన స్టార్ ప్లస్ టీవీ ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. జర్నలిస్టులపై టీడీపీ చేసిన దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.
దీంతో ఈ ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నిరసనలు జరగడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. దాడికి కారణమైన ప్రముఖులను పక్కనబెట్టి ఇతరులపై కేసులు నమోదు చేయడంపై విమర్శలు చెలరేగాయి. దీనికి స్పందించిన జిల్లా ఎస్పీ సీతారామాంజనేయులు తాను స్వయంగా కేసును దర్యాప్తు చేపడతానని తాను వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఉద్దేశ్యపూర్వకంగా పక్కనబెట్టిన వారిని కూడా విచారిస్తానని స్థానిక పోలీసులకు ఆదేశాలిచ్చారు. కాగా ఈ ఘటన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో మనుషులు ఇంతకు తెగిస్తున్నారా అని కామెంట్స్ చేసి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ ఆయన హామీ ఇచ్చిన అనంతరం ఆ కేసు నీరు గారి పోవడం గమనార్హం..