తెలుగు జర్నలిజం ఎప్పటికప్పుడు తన స్థాయి చాలా తక్కువ, తమకు పెద్దగా ప్రజలకి జ్ఞానాన్ని పెంచడం ఇష్టం లేదు, లేదు లేదు అసలు మాకే జ్ఞానం లేదు అని నిరూపించుకుంటూనే ఉంటుంది…
ఇవాళ కొత్తగా ఏం జరిగింది అంటారా? కేంద్రం “పద్మ” పురస్కారాలను ప్రకటించింది కదా? అందులో మన వార్తాపత్రికలలో పెద్ద పెద్ద ఫోటోలతో కనపడింది ఎవరు? పద్మ విభూషణ్ లు ఎవరికి వచ్చాయి? ఠక్కున గుర్తొచ్చిందా? చిరంజీవి, వెంకయ్యనాయుడు కదూ?
శభాష్… బిందేశ్వర్ పాఠక్ కి పద్మ విభూషణ్ వచ్చింది తెలుసా? ఆయనెవరు అని అంటారా? లేదు లేదు చూసాం ఆయన ఫోటో కూడా వేశారు అంటారా? లేదు మాకు ఆయన ముందే తెలుసు అంటారా? పర్వాలేదు మన తప్పు కాదది, మనకి తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నోళ్లే వాళ్ల బాధ్యత ఎంటర్టైన్మెంట్ అనుకుంటుంటే మనమేం చేస్తాం..
బిందేశ్వర్ పాఠక్ : ఎవరో తెలుసా? సులభ్ కాంప్లెక్స్ అని విన్నారా? అబ్బో వాసన… అంటారా? ఆయనే స్థాపించింది. 1970 లో సులభ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ స్థాపించి దేశంలో బహిరంగ మల విసర్జన నిర్మూలనకి కంకణం కట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో సులభ్ కాంప్లెక్స్ లు నిర్మింపజేశాడు. 2014 లో మొదలైన స్వచ్ఛ భారత్ మిషన్ కి ఈయన సలహాలు ఇచ్చారు. ఈయన సేవలు గుర్తించి 1991 లోనే పద్మ భూషణ్ ఇచ్చారు కూడా.. ఈయన సంస్థ ద్వారా ఎంతోమంది మాన్యుయల్ స్కేవెంజింగ్ నుండి బయటపడేలా వారు హుందాగా జీవించేలా చేశారు. అంతేగాక పర్యావరణవేత్త, మానవ హక్కుల కార్యకర్తగా కూడా ఈయన ప్రసిద్ధి..
“టాయిలెట్ మ్యాన్” గా ప్రసిద్ధికెక్కిన బిందేశ్వర్ పాఠక్ గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు 80 ఏళ్ల వయసులో మరణించాడు.. ఆ రోజు కూడా ఆయన స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీ లోని సులభ్ కాంప్లెక్స్ వద్దే జరుపుకున్నారు కూడా…
Padma Vibhushan for ” One step towards cleanliness”