రాష్ట్రంలో టీడీపీకి అత్యంత బలమైన సీటు అంటే టక్కున గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం. టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. అలాంటి కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం చంద్రబాబు నాయుడి ఆటలో భాగంగా రఘురామకృష్ణ టీడీపీ లో జాయిన్ అయ్యేసరికి మూడు ముక్కలు అయ్యి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. మొదట అప్పటికే రెండు సార్లు గెలిచి మంచి పేరు తెచ్చుకున్న శివరామరాజును 2019 లో తప్పించి రామరాజుకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. శివరామరాజును నరసాపురం ఎంపీ గా పోటి చెయ్యమని ప్రాధేయపడ్డారు. చివరకు ‘ఉండి’ ఎమ్మెల్యేగా రామరాజు గెలిచారు. నరసాపురం ఎంపీగా శివరామరాజు ఓడిపోయారు.
తిరిగి 2024 ఎన్నికల నేపథ్యంలో శివరామరాజు తిరిగి ఉండి ఎమ్మెల్యేగా పోటి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి విన్నవించుకున్నారు. మొదట సరే అని చెప్పిన చంద్రబాబు నాయుడు తీరా ఎలక్షన్ టైం వచ్చేసరికి రామరాజుకే ఉండి టికెట్ కేటాయించారు దీనితో శివరామరాజు తనకు అవమానం జరిగిందని టీడీపీ కి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఈలోగా రామరాజు కూడా ప్రచారం మొదలు పెట్టిన తరువాత రఘురామకృష్ణంరాజు రూపంలో మూడో రాజు ఉండి నియోజకవర్గంలో ప్రవేశించి టీడీపీని మూడు ముక్కలుగా చీల్చారు. రఘురామకృష్ణంరాజుకు బీజేపీ నరసాపురం ఎంపీ టికెట్ నిరాకరించడంతో చంద్రబాబుకు రఘురామ కృష్ణంరాజుకు మధ్యగల లోపాయికారి ఒప్పందంలో భాగంగా టీడీపీలోకి తీసుకొని ఉండి నియోజకవర్గం కేటాయించారు. ఇప్పుడు ఇదే టీడీపీలో గ్రూపులకు తెర తీసింది. రఘు రామ కృష్ణంరాజుకు టికెట్ ఇస్తే గనుక రామరాజు వర్గం సపోర్ట్ చెయ్యము స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతము అని ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్న వైసీపీ నాయకులు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు.
ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు తనకు టికెట్ ఇవ్వని పక్షంలో వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని వైసీపీ లోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది. దీనితో చంద్రబాబు నాయుడి ఆటలో భాగంగా ఉండి నియోజకవర్గం మూడు ముక్కలుగా విడిపోయి ఓడిపోయే పరిస్థితికీ వచ్చింది.