గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గుంటూరు ఎంపీ పరిధిలో దగ్గర దగ్గరగా మూడు లక్షల కాపు సామజిక వర్గానికి చెందిన ఓటర్లు వున్న వారికి ఒక అసెంబ్లీ సీటు లేదా ఎంపీగా టీడీపీ అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గానికి మూడు ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఎంపీ స్థానం కేటాయించారు. దీనితో ఇప్పటికే కాపు సామజిక వర్గాలు టీడీపీ మీద గుర్రుగా వుండి తమకు పోటి చేసే అవకాశం ఇవ్వలేదు అని బాధలో వుంటే ఈ మధ్యనే కాపు సామజిక మీటింగ్ పెట్టిన పెమ్మసాని టీడీపీ లోని కాపు నాయకులకే మాట్లాడే అవకాశం ఇచ్చి మిగతా వారిని మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీనితో ఓవైపు కాపు కులానికి టిక్కెట్లు ఇవ్వలేదు మరోవైపు ఇలా పిలిచి అవమానించడం బాగాలేదు, మేము టీడీపీకి కాపు కాయాల్సిన అవసరం లేదు అంటూ మిగిలిన కాపు నాయకులు అక్కడినుండి వెళ్ళిపోయారు.
ఇక అదే టైంలో వైసీపీ కాపులకు ఒక అసెంబ్లీ, ఎంపీ స్థానంలో టిక్కెట్లు ఇచ్చి వారిని గౌరవించింది. ఇప్పుడు అదే విషయం చెప్పి కొద్దిగా కాపులను కలుపుకుపోమని చెబితే కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని పెమ్మసాని మాట్లాడారు అంటూ జనసేన జిల్లా నేత అయిన విరశెట్టి సుబ్బారావు అవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఉమ్మడి ప్రచారం గురించి పెమ్మసాని అడగటానికి పోతే రాత్రికి రమ్మని చివరకు నిద్ర వస్తుంది మీరు వెళ్ళిపొండి అని నిర్లక్ష్యంగా సమధానం ఇచ్చి అవమానించి పంపారు. అసలు టీడీపీ తో జన సేన పొత్తు పెట్టుకున్న తరువాత జన సేన నాయకులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని విరశెట్టి సుబ్బారావు వాపోయారు.
మరో టీడీపీ కాపు నాయకుడు డేగల ప్రభాకర్ టీడీపీ, జనసేన పొత్తులో పోటి చేద్దాం అని నియోజవర్గం అంతా కలియ తిరిగి ఖర్చు చేస్తే చివరకు డబ్బులు ఎక్కువగా వున్నాయని ఎన్ఆర్ఐ పెమ్మసానికి టీడీపీ తరపున గుంటూరు ఎంపీ కేటాయించారు. దీనితో డేగల ప్రభాకర్ టీడీపీ నాయకులు నమ్మించి గొంతు కోశారని టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు అని గగ్గోలు పెట్టారు.
ఇవన్నీ పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్తే కాపులను పట్టించుకోవద్దని, మీరు పగలు మాతో తిరుగుతున్నారు రాత్రికి మీ కాపు కులం ప్రత్యర్ధి నాయకులతో తిరుగుతున్నారు అంటూ కాపులను అవమానిస్తూ పెమ్మసాని మాట్లాడటం గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.