టీడీపీలో చేరిన తరువాత మహసేన రాజేష్ కు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పి గన్నవరం అసెంబ్లీనియోజకవర్గం నుండి పోటీకి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. పార్టీ తరుపున అభ్యర్ధుల ప్రచారానికి అవకాశం ఇవ్వలేదు ఇది మరో షాక్. అంతటితో ఆగకుండా నిన్న అవనిగడ్డలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తరుపున అంబటి రాయుడుతో కలిసి ప్రచారానికి ఆహ్వానం పలికారు. అయితే మహసేన రాజేష్ రాకముందే అంబటి రాయుడుతో ప్రచారం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మహసేన రాజేష్ చర్లపల్లి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. తనకు ఫోన్ చేసిన పార్టీ నేతలకు పిలిచి దేనికి అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే టీడీపీ ఇచ్చిన పి గన్నవరం టికెట్ కేవలం జనసేన పార్టీ అందులో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం చేసిన గొడవల వలనే తనకు దక్కలేదని జనసేన పార్టీపై కోపంతో రగిలిపోతున్న మహసేన రాజేష్ ను ఇప్పుడు ప్రచారం అంటూ అవనిగడ్డకు పిలిచి తను రాక మునుపే జనసేన పార్టీ వర్గాలు పవన్ కళ్యాణ్ వర్గానికే చెందిన అంబటి రాయుడుతో ప్రచారం మొదలు పెట్టారు. ఈ జనసేన పార్టీ మళ్ళీ మళ్ళీ దళితులను కావాలని అవమానిస్తున్నారంటూ తన ఆత్మీయుల దగ్గర వాపోయారు. పవన్ కళ్యాణ్ ను తిట్టిన చింతమనేని ప్రభాకర్ కు టికెట్ కేటాయించారు. బుచ్చయ్య చౌదరి కి టికెట్ కేటాయించారు కేవలం నేను దళితుడిని కాబట్టే టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని, అదే బాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అందులో జనసేన రాజమండ్రీ రూరల్ సీటు కోసం ఎంత గొడవ చేసిన చివరకు బాబు వర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరి కి ఇచ్చారు తప్పా వెనక్కి తగ్గలేదు అంటూ కూటమిలో దళితులకు విలువ లేదని తమని చిన్నచూపు చూస్తున్నారని మహాసేన రాజేష్ సన్నిహితుల వద్ద అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీల వలన జరుగుతున్న అవమానాలకు నా దారి నేను చూసుకుంటా అని అలిగి వీడియోలు వదిలిన మహాసేన రాజేష్ ఇప్పుడు జరిగిన అవమానానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.