సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించడానికి ప్రయత్నించడమే కాకుండా దానిపై అనేక కట్టుకథలు అల్లింది ఎల్లో గ్యాంగ్. కుట్రదారుడు టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా అయితే ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడారు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ ఒక్కోరికి ఒక్కో వర్షన్ ఇచ్చాడు. ఉమా ప్రమేయం ఉందని బయటపడగానే ఎల్లో మీడియాను పిలిచి ‘రూ.300 కిరాయి ఇస్తామని ఇవ్వకుండా రోడ్డు మీద వదిలేశారు. వాళ్లమ్మకు ఇస్తామని రూ.200 ఇవ్వలేదు. ఎవరికి వారు వెళ్లిపోయారు. బాధ, కోపంతో చీకట్లో రాయి విసిరాడు. దురదృష్టవశాత్తు సీఎంకు తగిలింది. ఈ ఘటన అనుకోకుండా జరిగింది’ అని చెప్పారు. ఉమాతో ఏ1 సతీష్ ఉన్న ఫొటోలు బయటపడగానే స్వరం మూగబోయింది. జగన్ హత్యకు కుట్రలు చేసిందే కాకుండా ఎవరికి తోచించి వారు చెప్పేశారు. అన్న క్యాంటీన్ మూసేయడంతో దాడి చేసి ఉండొచ్చని ఓ మారు అన్నారు. లోకేశ్ పెట్టిన ట్వీట్లు సరేసరి.
ఇక ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడేమో ‘జగన్‌ది గులకరాయి డ్రామా.. ఎవరో రాయి వేశారంట.. అది తగిలిందంట. ఎక్కడా కనిపించలేదు. ఇతను చేసే నేరాలను వేరే వాళ్లపై తోసేయడంలో దిట్ట’ అని వ్యాఖ్యానించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ‘జగన్ గారికి ఇలా దెబ్బ తగిలిలిందని చెప్పారు. నన్ను ఏం చేయమంటారని అడిగా. నిజమో.. అబద్ధమో నాకేం తెలుసు. అతనే టప్మని కొట్టేసుకుని ఉండొచ్చు కదా.. ఎవరికి తెలుసు. దండల్లో రాయి పెట్టుకుని కొట్టుకున్నారేమో.. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. నాటకాలు భరించలేకపోతున్నాం’ అని నీచంగా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో వీరు చూసిన పనికి ప్రజానీకం అసహ్యించుకుంటోంది. అయినే పచ్చ గ్యాంగ్ మారదు. తోచిన కథలను చెబుతూనే ఉంటుంది.