ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఒక్కొక్క వీడియో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల పాల్వాయి గెట్ బూత్ లో వైసీపీ ఏజెంట్ పై టీడీపీదాడి చేసి వారి పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్ చేస్తున్న సమయంలో మాచర్ల అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా బూత్ లోకి వెల్లి ఆ ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఈసీ కేసులు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం తుమ్మూరు కోట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న వీడియో ప్రచారంలోకి వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు తుమ్మూరు కోట గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 204 లో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. సదర్ వీడియో విజువల్స్ లో ఈవీఎం ద్వసం చేస్తున్న వారిలో రెడ్ షర్ట్ వేసుకొని ఉన్న అతను మగాం మల్లికార్జునరావు అని, బనియనుతో కర్ర పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి పేరు పులిపాటి నాగేశ్వరావుగా, తల పాగాలో ఉన్న వ్యక్తి బోయిన నరసింహారావు తెలుగుదేశం ఏజెంట్ గా చెబుతున్నారు. మరి ఈ వీడియో ఆధారంగా ఈసీ వారిపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.